Yadadri Dress Code: యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yadadri Dress Code: తెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు ఇప్పుడు డ్రెస్ కోడ్ తప్పనిసరి. నరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని యాదగిరిగుట్ట దేవస్థానం నిర్ణయించింది. వివిధ సేవల్లో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాలనే నిబంధన జూన్ 1 నుంచి అమల్లోకి రానుంది. కాగా.. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం అనంతరం లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఆలయంలో ఇప్పటికే ఆలయ ఈవోతో పాటు సిబ్బంది కూడా డ్రెస్ కోడ్‌ను పాటిస్తున్నారు. హిందూ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించేలా చర్యలు తీసుకోవాలని యాదగిరిగుట్ట దేవస్థానం నిర్ణయించింది. నిత్య కల్యాణం, హోమం, జోడు సేవ, శ్రీసుదర్శన నరసింహ హోమం, శ్రీసత్యనారాయణ స్వామి వ్రతాలు తదితర కార్యక్రమాల్లో పాల్గొనే భక్తులు సంప్రదాయ వస్త్రాలు ధరించాలని నిబంధన విధించారు.
Read also: పెళ్ళైన తర్వాత అమ్మాయిలు ఎందుకు బరువు పెరుగుతారు?
Also Read
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
- Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగానే యాదాద్రిలో కూడా భక్తుల వీఐపీ బ్రేక్ దర్శనానికి డ్రెస్ కోడ్ తప్పనిసరి చేసింది. స్వామివారి విరామ దర్శనానికి వచ్చే భక్తులకు ఈ నిబంధన తప్పనిసరిగా వర్తిస్తుందని, అదేవిధంగా సాధారణ ధర్మ దర్శనానికి క్యూ లైన్‌లో వచ్చే భక్తులకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉందని యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో భాస్కర్‌రావు తెలిపారు. జూన్ 1 నుంచి ఆలయంలో డ్రెస్ కోడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఆలయంలో ఆధ్యాత్మికత, భక్తి భావాన్ని పెంపొందించేందుకే ఇలాంటి నిబంధనలు అమలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు యాదాద్రీశు క్షేత్ర ప్రాధాన్యతను తెలియజేసేందుకు సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నామని, బోర్డుపై క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వివరాలు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని ఈవో భాస్కర్ రావు తెలిపారు. తెలుగు, హిందీ మరియు ఆంగ్లంలో ఈ ప్రాంతం యొక్క ప్రాముఖ్యత గురించి. జూన్ 1 నుంచి అమలు చేయనున్న సంప్రదాయ వస్త్రధారణకు భక్తులందరూ సహకరించాలని కోరారు.
Warangal MGM Hospital: దారుణం.. ఫోనులో డాక్టర్.. ఆపరేషన్ చేసిన నర్సులు.. పాప మృతి
తాజావార్తలు
-
Vastu Tips: ఇంట్లో డబ్బు ఉంచే ప్రదేశం వాస్తు ప్రకారం ఎలా ఉండాలి? చాలామందికి తెలియని విషయాలు ఇవే!
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!