రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించిన అటవీ అనుమతులను కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ మంజూరీ చేసినట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. అందుకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర అటవీశాఖ అసిస్టెంట్ ఇన్ స్పెక్టర్ జనరల్ కైలాష్ భీమ్ రావ్ భవర్, ఐఎఫ్ఎస్ లేఖ రూపంలో తెలియజేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
Yadadri Dress Code: తెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు ఇప్పుడు డ్రెస్ కోడ్ తప్పనిసరి. నరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని యాదగిరిగుట్ట దేవస్థానం నిర్ణయించింది.
Krishna Express: సికింద్రాబాద్-తిరుపతి పద్మావతి ఎక్స్‌ప్రెస్ లో పొగలు వ్యాపించిన ఘటన మరువక ముందే కృష్ణ ఎక్స్ ప్రెస్ ట్రైన్ వెళుతున్న రైల్ పట్టారు విరిగిపోవటం ఘటన సంచలనంగా మారింది.
భార్యాభర్తల బంధం అంటే అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ అని చెబుతూ ఉంటారు. ఒకసారి మూడుముళ్ల బంధంతో దాంపత్య బంధంలోకి అడుగు పెట్టిన తర్వాత ఒకరికి ఒకరు తోడు నీడగా ఉంటూ కడవరకు కష్టసుఖాలను పంచుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ గేట్ వద్ద పోలీసులు భారీగా బంగారం పట్టుకున్నారు. పక్కా సమాచారంతో స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ రంగంలోకి దిగింది. పంతంగి టోల్ గేట్ వద్ద తనికీలు నిర్వహించాగా.. 3.05 కేజీల బంగారం సీజ్ చేసారు అధికారులు.
తెలంగాణలో ఈ మధ్య వరుసగా అమ్మాయిలపై జరుగుతోన్న అఘాయిత్యాలు, దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి.. వరుస ఘటనలో వెలుగు చూస్తుండడంతో.. బెంబేలెత్తిపోతున్నారు తల్లిదండ్రులు.. ఇక, ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒంటరిగా ఉన్న యువతిపై దాడి చేశారు గుర్తుతెలియని వ్యక్తులు.. మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఒంటరిగా ఉన్న యువతిపై గుర్తు తెలియని ఆగంతకుడు దాడికి ఒడిగట్టాడు. యువతి గొంతు కోసి పరారయ్యారు.. గాయాలపాలైన యువతిని భువనగిరి ఏరియా ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతోంది.…
హైదరాబాద్ నడిబొడ్డులోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసు తీవ్ర కలకలం రేపింది.. అయితే, ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాజును ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. సింగరేణి కాలనీలో అదృశ్యమైన ఆరేళ్ల బాలిక అనుమానాస్పద రీతిలో మృతిచెందడంతో కలకలం రేగింది.. అయితే, బాలిక పక్కింట్లో నివసించే రాజు అనే వ్యక్తి ఇంట్లోనే మృతదేహమై కనిపించింది చిన్నారి.. దీంతో.. బాలిక తల్లిదండ్రులతో పాటు స్థానికులు ఆందోళనకు దిగారు.. నిందితుడు పరారీ కాగా.. వెంటనే…