చాలామంది అమ్మాయిలు పెళ్లయిన తర్వాత బరువు విపరీతంగా పెరుగుతారు. అసలు పెళ్లయిన తర్వాత అమ్మాయిలు బరువు ఎందుకు పెరుగుతారు అంటే అందుకు అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు.

పెళ్లయిన తర్వాత శారీరకంగా జరిగే మార్పుల వల్ల, హార్మోన్లలో జరిగే మార్పుల వల్ల, జీవనశైలి కారణాలవల్ల అమ్మాయిలు బరువు పెరిగే అవకాశం ఉంటుంది.  

పెళ్లికి ముందు అమ్మాయిలు తమ బరువు పెరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. 

బరువు పెరగకుండా తమ శరీరం పైన శ్రద్ధ పెడతారు కానీ పెళ్లయిన తర్వాత ఆ కోరిక కాస్త తగ్గుతుంది. శరీరాన్ని నిర్లక్ష్యం చేస్తారు. 

జీవిత భాగస్వామి దొరికాడు కదా అని తమ శరీరం పై శ్రద్ధ పెట్టడం మానేస్తారు. ఫలితంగా బరువు పెరుగుతారు.

పెళ్లయిన కొత్తలో అమ్మాయిలకు కొంచెం సౌకర్యవంతమైన జీవితం ఉంటుంది. కుటుంబ సభ్యులు బంధువులతో విందులు వినోదాలలో పాల్గొంటారు. 

ఇక నాన్ వెజ్, స్పైసీ ఫుడ్ తింటారు.బరువు పట్టింపు లేనట్టు ఆహారం తీసుకోవటం, ఈ సౌకర్యవంతమైన జీవితం అమ్మాయిలు బరువు పెరగడానికి కారణం అవుతుంది. 

పెళ్లయిన తర్వాత భర్తతో ప్రతిరోజు శృంగారం చేయడం వల్ల ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది కూడా వివాహిత అమ్మాయిలు బరువు పెరగడానికి కారణం అవుతుంది. 

 పెళ్లయిన తర్వాత సరిగా నిద్రపోకపోవడం వల్ల కూడా అమ్మాయిలు బరువు పెరిగే అవకాశం ఉంది.

పెళ్ళయిన తర్వాత అమ్మాయిలలో బాధ్యత పెరుగుతుంది. ఫలితంగా ఆందోళన కూడా పెరుగుతుంది. దీనివల్ల కూడా బరువు పెరుగుతారు. 

పెళ్లయిన తర్వాత అమ్మాయిలు ఫిట్నెస్ పైన పెద్దగా శ్రద్ధ పెట్టకపోవడం వల్ల కూడా వారు బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ప్రస్తుతం అమ్మాయిలు వివాహం చేసుకోవడానికి చాలా ఆలస్యంగా నిర్ణయం తీసుకుంటున్నారు.

27 నుంచి 30 ఏళ్ల వయసు వస్తే కానీ పెళ్లిళ్లు చేసుకోవడం లేదు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం పెరుగుతున్న వయసుతోపాటు జీవక్రియ రేటు తగ్గడం ఫలితంగా బరువు పెరగడం వంటివి జరుగుతున్నాయని చెబుతున్నారు.