Marriage Age: పాతికేళ్లు వచ్చినా పెళ్లి ముచ్చటే లేదు.. అమ్మాయిలూ ఎదిగారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Marriage Age: కాలం మారింది. కాలంతో పాటు మనిషి జీవితంలో తీరు మారింది. అమ్మాయిలూ ఎదిగారు. ఒకప్పుడు ఆడపిల్ల పెళ్లంటే గుండెల మీద కుంపటిలా భావించేవారు! ఒక అయ్య చేతిలో పెడితే బాధ్యత తీరుపోతుందనే ఫీలింగ్ సగటు తల్లిదండ్రులకు ఉండేది! ఆర్థిక స్థోమత లేని నిరుపేద కుటుంబాలు ఆడపిల్లకు మెచ్యూరిటీ రాకముందే పెళ్లి చేసే దౌర్భాగ్య పరిస్థితులు ఉండేవి! మొన్నటి వరకు ఎక్కడ చూసినా బాల్య వివాహాల ఘటనలే! అయితే.. మనుషుల్లో మార్పు, సమాజంలో చైతన్యం, ఆడపిల్లలు చదువుకోవాలనే తపన మొదలైనవి బాల్య వివాహాలకు అడ్డుగా నిలిచాయి. 18 ఏళ్లు వచ్చినా, ఆ తర్వాత కూడా అమ్మాయికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు ఆలోచించడం లేదు. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలు చేయాలనే ఆసక్తిని ప్రోత్సహిస్తారు. అవసరమైతే పెళ్లి వాయిదా వేస్తామన్నా అభ్యంతరం తెలపడం లేదు. అమ్మాయికి పాతికేళ్లు వచ్చిన వివాహం గురించి అస్సలు ఆలోచించడమే లేదు.
ఇప్పటికీ అక్కడక్కడా బాల్య వివాహాలు, యువతులు ఆలస్యంగా వివాహం చేసుకుంటున్నారు, అయితే వివాహ వయస్సుపై భారతదేశ రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం నిర్వహించిన జాతీయ నమూనా సర్వేలో, మహిళల సగటు వివాహ వయస్సు దేశం 22.7 సంవత్సరాలుగా వెల్లడైంది. ఈ సర్వే 2020లో జరిగినప్పటికీ, వాటి విశ్లేషణ ఆలస్యమైంది. అందుకు సంబంధించిన గణాంకాలను కార్యాలయం తాజాగా విడుదల చేసింది. జాతీయ సగటు కంటే తెలంగాణ మెరుగైన స్థానంలో ఉందని తేలింది. సర్వే గణాంకాలను పరిశీలిస్తే, 2017 నాటికి దేశంలో మహిళల సగటు వివాహ వయస్సు 22.1 సంవత్సరాలు. 2020 నాటికి అది 22.7 సంవత్సరాలకు చేరుకుంది. ఆయా రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను అనుసరించి ఆడపిల్లల వివాహ వయస్సు ముడిపడి ఉన్నందున వివిధ రాష్ట్రాల మధ్య సగటు వయస్సులో స్పష్టమైన తేడాలు ఉన్నాయి. వివాహ సగటు వయసుకు సంబంధించి తెలంగాణ గణాంకాలను పరిశీలిస్తే పట్టణ ప్రాంతాల్లో 2020 నాటికి 24.3 ఏళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో 22.8 ఏళ్లుగా తేలింది.
Also Read
- CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
- Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
కశ్మీరీ యువతులకు పెళ్లిళ్లు
ఈ పరిణామాల క్రమంలో దేశంలో అమ్మాయిల సగటు పెళ్లి వయసు పెరిగిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి. 2017 వివరాల ప్రకారం ఉన్న 22.1 ఏళ్ల సగటు కాస్త బెటరైంది. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయం వివాహ వయసులపై జరిపిన జాతీయ నమూనా సర్వేలో దేశవ్యాప్తంగా మహిళల సగటు వివాహ వయసు 22.7 ఏళ్లుగా వెల్లడైంది. 2020లో ఈ సర్వే జరిగినప్పటికీ వాటి విశ్లేషణ ఆలస్యమైంది. అందుకు సంబంధించిన గణాంకాలను ఆ కార్యాలయం ఇటీవల విడుదల చేసింది. అత్యధికంగా 26 ఏళ్లకు కశ్మీరీ యువతులకు పెళ్లిళ్లు జరుగుతుంటే, అత్యల్పంగా 21 ఏళ్లలోపే జార్ఖండ్, బెంగాల్ అమ్మాయిలు మ్యారేజీ చేసుకుంటున్నట్టు తేలింది.
6 చట్టాలను సవరించాలి
దేశంలో మహిళలకు చట్టబద్ధమైన కనీస వివాహ వయస్సును పురుషులకు ప్రస్తుతం ఉన్న 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి బాల్య వివాహాల నిషేధ సవరణ బిల్లును తీసుకొచ్చారు. ఇది ప్రస్తుతం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలనలో ఉంది. అయితే దేశంలో కనీస వివాహ వయస్సును మార్చాలంటే కేంద్రం 6 చట్టాలను సవరించాల్సి ఉంటుంది. ది ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్-1872, ది పార్సీ మ్యారేజ్ అండ్ డైవోర్స్ యాక్ట్-1936, ది ముస్లిం పర్సనల్ లా (షరియత్) అప్లికేషన్ యాక్ట్-1937, ది స్పెషల్ మ్యారేజ్ యాక్ట్-1954, ది హిందూ మ్యారేజ్ యాక్ట్-1955, ది ఫారిన్ మ్యారేజ్ యాక్ట్-1969 సవరించాల్సి ఉంటుంది.
IPL 2023: నేడు కోల్‌కతా వర్సెస్ ఢిల్లీ.. వార్నర్ సేన బోణీ కొట్టేనా?
తాజావార్తలు
-
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!