కాలం మారింది. కాలంతో పాటు మనిషి జీవితంలో తీరు మారింది. అమ్మాయిలూ ఎదిగారు. ఒకప్పుడు ఆడపిల్ల పెళ్లంటే గుండెల మీద కుంపటిలా భావించేవారు! ఒక అయ్య చేతిలో పెడితే బాధ్యత తీరుపోతుందనే ఫీలింగ్ సగటు తల్లిదండ్రులకు ఉండేది!
అమ్మాయి పెళ్లికి ఏది సరైన వయసు? నలబై ఏళ్ల క్రితం ఆడ పిల్ల వివాహ వయస్సు పదిహేనేళ్లు. తరువాత దానిని పద్దెనిమిదికి పెంచారు. ఇక ముందు మగపిల్లలతో సమానంగా ఆడపిల్ల పెళ్లి వయస్సు కూడా 21 ఏళ్లుగా సర్కార్ చట్ట సవరణ చేయనుంది. జయా జైట్లీ నేతృత్వంలో ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్ కమిటీ సిఫార్సులను కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. ఇక పార్లమెంట్ ఆమోదం పొందటమే తరువాయి. అంటే ఇకపై మన దేశంలో టీనేజ్ వివాహాలకు ఛాన్స్ లేదు. బాల్య…