Telangana : తెలంగాణలో మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం భారీ వరాన్ని ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో మొత్తం రూ.304 కోట్ల వడ్డీ లేని రుణాలు ప్రభుత్వం జమ చేసింది. ఈ నిధుల విడుదలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లా డీఆర్‌డీఏ అధికారులతో సమీక్షించారు. ప్రస్తుతం ములుగు జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి సీతక్క ఏటూరునాగారం నుంచి వర్చువల్…
సౌదీ అరేబియాలోని రియాద్ మెట్రో నడపడానికి హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ ఎంపికైంది. అవును, లోకో పైలట్‌గా పనిచేస్తున్న ఈ మహిళ ఇప్పుడు సుదూర సౌదీ అరేబియాలో మెట్రో రైలు నడపబోతోంది. ఈ వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.
అమ్మాయిలు, మహిళల భద్రత కోసం సీఎం రేవంత్ రెడ్డి మార్చి 12 2024లో, టీ సేఫ్ అనే యాప్ ను లాంచ్ చేశారు. ఇప్పటివరకు 15,000 మందికిపైగా మహిళలు ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారు. మహిళల ప్రయాణ సమయంలో, పని ప్రాంతాల్లో వారి భద్రత కోసం ఈ యాప్ పనిచేస్తోంది.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. అన్ని పార్టీలు హేమాహేమీలైన అభ్యర్థులను బరిలోకి దింపాయి. అయితే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో శ్రీకళారెడ్డి అనే మహిళ పోటీ చేస్తోంది.
కాలం మారింది. కాలంతో పాటు మనిషి జీవితంలో తీరు మారింది. అమ్మాయిలూ ఎదిగారు. ఒకప్పుడు ఆడపిల్ల పెళ్లంటే గుండెల మీద కుంపటిలా భావించేవారు! ఒక అయ్య చేతిలో పెడితే బాధ్యత తీరుపోతుందనే ఫీలింగ్ సగటు తల్లిదండ్రులకు ఉండేది!