* నేడు దుబాయ్ పర్యటనకు సీఎం చంద్రబాబు.. ఉదయం 7.30కి ఉండవల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు సీఎం చంద్రబాబు.. ఉదయం 10.15కి శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి దుబాయ్ కి చంద్రబాబు.. సీఎం చంద్రబాబు వెంట సీఎంవో, పరిశ్రమల శాఖ అధికారులు..
* నేడు వైసీపీ నేతల ఛలో రాజయ్యపేట.. బల్క్ డ్రగ్ పార్క్ కి వ్యతిరేకంగా పోరాడటానికి మద్దతు తెలపనున్న వైసీపీ.. పాల్గొననున్న ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, కన్నబాబు, వైసీపీ నేతలు.. రాజయ్యపేట వెళ్లేందుకు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చిన పోలీసులు.. రాజయ్యపేటలో కొనసాగుతున్న పోలీసుల పహారా..
* నేడు శాసన సభాపక్ష పిటిషన్ల కమిటీ పర్యటన.. డిప్యూటీ స్పీకర్ కె. రఘురామ కృష్ణంరాజు అధ్యక్షతన శాసన సభాపక్ష పిటిషనల్ కమిటీ సమావేశ.. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, ఇతరుల ఫిర్యాదులు పరిశీలనలో భాగంగా విశాఖకు వస్తున్న కమిటీ..
* నేడు విజయవాడలో బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం.. ఉదయం 10 గంటలకు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ అధ్యక్షతన భేటీ.. హాజరుకానున్న బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా అధ్యక్షులు, కార్పొరేషన్ ఛైర్మన్లు..
* నేడు నకిలీ మద్యం కేసులో ఏ1 జనార్ధన్ కస్టడీ పిటిషన్ పై ఆదేశాలు ఇవ్వనున్న ఎక్సైజ్ కోర్టు.. జనార్ధన్ తో పాటు అతడి సోదరుడు నిందితుడు జగన్మోహన్ ను 10 రోజుల కస్టడీ కోరిన ఎక్సైజ్ శాఖ..
* నేడు సిద్దిపేట జిల్లాలో ఇంచార్జ్ మంత్రి వివేక్ పర్యటన.. గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి వివేక్..
* నేడు సంగారెడ్డి జిల్లాలో మంత్రి దామోదర రాజ నర్సింహ పర్యటన.. సంగారెడ్డిలో పోలీసులకు ఉచిత మెడికల్ క్యాంప్ ని ప్రారంభించనున్న మంత్రి దామోదర.. జోగిపేట మార్కెట్ యార్డులో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్న మంత్రి దామోదర రాజ నర్సింహ..
* నేడు హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. సదర్ ఉత్సవ మేళా సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలు.. నారాయణగూడలోని YMCA దగ్గర సదర్ ఉత్సవ మేళా.. రామ్ కోటి, లింగంపల్లి, నారాయణగూడ, బర్కత్ పూరా, హిమాయత్ నగర్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
* నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 26 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు.. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 15 గంటల సమయం..
* నేటి నుంచి వచ్చే నెల 21వ తేదీ వరకు శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు.. ఈ నెల 31న కృష్ణమ్మకు నదిహారతి, నవంబర్ 5న కార్తీక పౌర్ణమి జ్వాలాతోరణం.. కార్తీకమాసం మొత్తం శ్రీస్వామివారి గర్భాలయ, సామూహిక అభిషేకాలు నిలుపుదల..
* నేడు మహిళల వన్డే వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా.. ఇండౌర్ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకి మ్యాచ్..