Metro Express: కరీంనగర్లో ‘సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్’ బస్సులు ప్రారంభం.. ఈ రూట్లల్లో అందుబాటులోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరీంనగర్ నగరవాసులకు మెరుగైన ప్రజా రవాణా సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్‌లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ‘సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్’ బస్సులను జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. పెరుగుతున్న నగర జనాభా, ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్థానిక రవాణాను మరింత సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
మొదటి దశలో భాగంగా ఆర్టీసీ కరీంనగర్ 2 డిపో పరిధిలో మూడు బస్సులతో ఈ సేవలు ప్రారంభమయ్యాయి. ఇవి ప్రధానంగా వాగేశ్వరి కాలేజీ, చింతకుంట, కొత్తపల్లి హవేలీ రూట్లలో ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. నగరం స్మార్ట్ సిటీగా మారుతున్న తరుణంలో.. వివిధ ప్రాంతాలలోని విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, మహిళలకు తక్కువ ఖర్చుతో కూడిన సురక్షితమైన, సమయపాలనతో కూడిన ప్రయాణాన్ని అందించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం.
Also Read
- AP UTF Strike: ఏపీ యూటీఎఫ్ నిరవధిక నిరాహార దీక్ష.. స్పెషల్ టెట్‌పై ఉపాధ్యాయుల ఆందోళన!
- Nandyal School: నంద్యాలలో దారుణం.. విద్యార్థులను కూలీలుగా మార్చిన స్కూలు యాజమాన్యం!
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
కరీంనగర్‌లోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన వ్యాపార కేంద్రాలను అనుసంధానిస్తూ ఈ రూట్లను రూపొందించారు. దీనివల్ల ప్రజలు ప్రైవేటు వాహనాలపై ఆధారపడటం తగ్గి, రవాణా ఖర్చులు గణనీయంగా ఆదా అవుతాయి. అంతేకాకుండా నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ ఒత్తిడి , కాలుష్యం కొంతమేరకు తగ్గే అవకాశం ఉంది. మహిళలు, విద్యార్థినులకు ఈ బస్సులు సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తాయి.
ప్రస్తుతం పరిమిత సంఖ్యలో మూడు మార్గాల్లోనే ఈ బస్సులు నడుస్తున్నప్పటికీ, ప్రజల నుండి వచ్చే ఆదరణ, డిమాండ్‌ను బట్టి రాబోయే రోజుల్లో మిగిలిన రూట్లకు కూడా విస్తరించాలని అధికారులు భావిస్తున్నారు. ప్రయాణికులు ఈ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సు సేవలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ , ఆర్టీసీ అధికారులు కోరారు.
తాజావార్తలు
-
AP UTF Strike: ఏపీ యూటీఎఫ్ నిరవధిక నిరాహార దీక్ష.. స్పెషల్ టెట్‌పై ఉపాధ్యాయుల ఆందోళన!
-
Suriya 50: సూర్య 50వ సినిమాగా ‘రోలెక్స్’.. లోకేష్ కనగరాజ్‌తో ఆ క్రేజీ కాంబో ఫిక్స్ అయినట్టేనా?
-
Robert Kiyosaki: $100 మిలియన్ల ఆస్తి.. కానీ బిలియన్ల అప్పు! ‘Rich Dad Poor Dad’ రచయిత రాబర్ట్ కియోసాకి అసలు కథ ఇదే
-
Pentagon Crisis: ఇరాన్‌తో యుద్ధం వేళ పెంటగాన్‌లో హై టెన్షన్.. 25 మంది ఔట్, 45 మంది ప్రమోషన్లకు బ్రేక్!
-
Nandyal School: నంద్యాలలో దారుణం.. విద్యార్థులను కూలీలుగా మార్చిన స్కూలు యాజమాన్యం!
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!