Drugs: డ్రగ్స్ సొమ్ముతో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు.. దర్యాప్తు వేగవంతం చేసిన ఈడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్, చెన్నై నగరాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిర్వహించిన సోదాల్లో కెటమైన్ డ్రగ్స్ అక్రమ రవాణా, మనీలాండరింగ్ నెట్వర్క్ వెలుగులోకి వచ్చింది. 2019లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ విచారణ ప్రారంభించింది. బెంగళూరులో జె. కన్నన్ వద్ద 26.75 కిలోల కెటమైన్, శివరాజ్ ఉర్స్ నిర్వహిస్తున్న రహస్య ల్యాబ్‌లో మరో 25.45 కిలోల డ్రగ్స్‌ను గతంలో స్వాధీనం చేసుకున్నారు.
ఈ అక్రమ తయారీకి హైదరాబాద్ కేంద్రంగా సహాయం అందించినట్లు ఈడీ గుర్తించింది. హైదరాబాద్‌లోని ఇన్‌కెమ్ లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఆర్అండ్డీ ఇన్‌ఛార్జ్‌గా పనిచేసిన పుట్టా వెంకటేశ్వర్లు, కెటమైన్ తయారీకి కావలసిన ముడిసరుకుతో పాటు సాంకేతిక సమాచారాన్ని శివరాజ్ ఉర్స్‌కు అందించారు. జె. కన్నన్, శివరాజ్ ఉర్స్, పుట్టా వెంకటేశ్వర్లు ముఠాగా ఏర్పడి కెటమైన్‌ను రహస్యంగా తయారు చేస్తూ విక్రయాలు జరిపారు.
Also Read
ఈ అక్రమ వ్యాపారం ద్వారా వచ్చిన కోట్లాది రూపాయలను నగదు, హవాలా మార్గాల్లో తరలించి రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వివిధ సంస్థలు, పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు అధికారులు గుర్తించారు. PMLA నిబంధనల ప్రకారం చేపట్టిన ఈ సోదాల్లో రూ.82.82 లక్షల భారతీయ కరెన్సీ, 18,000 అమెరికన్ డాలర్ల విదేశీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు కీలక దస్తావేజులు, ఆర్థిక లావాదేవీల రికార్డులు, డిజిటల్ పరికరాలను కూడా సీజ్ చేసి విశ్లేషిస్తున్నారు. ఆస్తుల కొనుగోళ్లు, అక్రమ నిధుల మూలాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..