ICC Test Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్ 10 లోకి రోహిత్ శర్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెస్ట్ బ్యాటర్ల కొత్త ర్యాంకింగ్ జాబితాను విడుదల చేసింది. న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ ఈసారి కూడా అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవడంలో సఫలమయ్యాడు.. అతని ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది.. ఇక ఆస్ట్రేలియాకు చెందిన ఎడమచేతి వాటం బ్యాటర్ ట్రావిస్ హెడ్ ఇంగ్లండ్‌కు చెందిన జో రూట్, ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ స్మిత్‌లను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరుకున్నాడు. అలాగే ఈసారి టాప్ టెన్ లో చోటు దక్కించుకోవడంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సక్సెస్ అయ్యాడు. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే… భారత్ నుంచి హిట్‌మన్ మినహా మరే బ్యాటర్ టాప్-10లో కనిపించలేదు.
ఇటీవల అరంగేట్రంలోనే విండీస్‌పై సెంచరీ సాధించిన యంగ్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్ ఐసీసీ ర్యాంకిగ్స్ లో 73వ ర్యాంక్‌లోకి దూసుకొచ్చాడు.. రెండో స్థానంలో ఉన్న ప్యాట్ కమిన్స్ కేవలం 828 పాయింట్లతోనే ఉండటం గమనార్హం. డొమినికా టెస్టులో ఫర్వాలేదనిపించిన రవీంద్ర జడేజా కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. మూడు స్థానాలు ఎగబాకిన అతను 779 రేటింగ్ పాయింట్లతో ఏడో స్థానానికి చేరుకున్నాడు. ఇక ఏడాదికిపైగా ఆటకు దూరంగా ఉంటున్న జస్‌ప్రీత్ బుమ్రా పదో స్థానంలో ఉన్నాడు.
Also Read
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
అదే సమయంలో ఆల్‌రౌండర్ల జాబితాలో జడేజా 449 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. ఈ ఆల్‌రౌండర్ల జాబితాలో 362 రేటింగ్ పాయింట్లతో అశ్విన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మరో ఇండియన్ ప్లేయర్ అక్షర్ పటేల్ ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక డొమినికా టెస్టులో హాఫ్ సెంచరీతో ఫర్వాలేదనిపించిన విరాట్ కోహ్లీ 14వ స్థానంలోనే కొనసాగుతున్నాడు. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు..అలాగే 11వ స్థానంలో రిషబ్ పంత్ ఉండగా, విరాట్ కోహ్లీ 14వ స్థానంలో ఉన్నాడు. ఛటేశ్వర్ పుజారా 29వ ప్లేస్‌లో ఉన్నారు.
టాప్ టెన్ లో ఉన్న బ్యాట్స్ మేన్స్ ఎవరంటే?
కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్)- 883 పాయింట్లు..
ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా)- 874 పాయింట్లు
బాబర్ ఆజం (పాకిస్థాన్)- 862 పాయింట్లు
స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)- 855 పాయింట్లు
మార్నస్ లబుషేన్ (ఆస్ట్రేలియా)- 849 పాయింట్లు
జో రూట్ (ఇంగ్లండ్)- 842 పాయింట్లు
ఉస్మాన్ ఖ్వాజా (ఆస్ట్రేలియా)- 824 పాయింట్లు
డారిల్ మిచెల్ (న్యూజిలాండ్)- 792 పాయింట్లు
దిముత్ కరుణరత్నే (శ్రీలంక)- 780 పాయింట్లు
రోహిత్ శర్మ (భారత్)- 751 పాయింట్లు..
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు