Swarnalatha Bhavishyavani: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతా వైభవంగా జరిగింది. అమ్మవారి బోనాల కార్యక్రమంలో భాగంగా కీలక ఘట్టం రంగం కార్యక్రమం ఇవాళ ఉదయం 10 గంటలకు జరిగింది. ఈ సందర్భంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ‘ప్రజలు చేసే పూజలు ఆనందంగా స్వీకరించానని అన్నారు. గత ఏడాది చేసిన వాగ్దానాన్ని మరిచిపోయారని అన్నారు. మీ అందరికి అవసరమైన బలాన్ని ఇచ్చానని అన్నారు. మీ వెంటే నేను ఉంటాను అన్నారు. వానలు పడతాయి.. మీరు భయపడకండి. ఆలస్యమైనా వర్షాలు కురుస్తాయని.. అగ్ని ప్రామాదాలు జరుగుతాయని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఐదు వారాల పాటు నైవేద్యాలు సమర్పించాలని అన్నారు. స్వర్ణలత భవిష్యవాణి మాట్లాడుతూ.. భక్తులు ఏ పూజలు చేసినా ఆనందంగా స్వీకరిస్తానని తెలిపారు. ఏది బయట పెట్టాలో ఏది పెట్టకూడదో నాకు మాత్రమే తెలుసని అన్నారు. సంతోషంగా ఎటువంటి లోపం లేకుండా ఆనందంగా పూజలు అందుకున్నానని తెలిపారు. కావాల్సినంత బలాన్ని ఇచ్చాను, మీతోనే నేను ఉంటానని అన్నారు. నా వద్దకి వచ్చిన వారిని చల్లగా చుసుకునే బాధ్యత నాదన్నారు. 5 వారాలు నాకు సాక పోయండి నాయన అన్నారు. ఏడూ వచ్చేసరికి నాకు తప్పని సరిగా జరిపించండని తెలిపారు. దీంతో రంగం కార్యక్రమం భవిష్యవాణి పూరైంది.
Read also: Fire in Balanagar: బాలానగర్ లో భారీ అగ్నిప్రమాదం.. లైఫ్ స్పేస్ అపార్ట్‌మెంట్‌లో మంటలు
ప్రవచనం వినేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రంగం కార్యక్రమం నేపథ్యంలో మహంకాళి ఆలయంలో భక్తులకు అమ్మవారి దర్శనాన్ని నిలిపివేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. పోతరాజుల ఊరేగింపు, ఘటోస్తవం ఘనంగా జరుగుతుందని మంత్రి అన్నారు. లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని తెలిపారు. రాత్రి అంత దర్శనాలు జరిగాయన్నారు. సీఎం, మంత్రులు, వివిధ పార్టీల పెద్దలు దర్శనం చేసుకున్నారని మంత్రి తలసాని తెలిపారు. ఒకప్పుడు రాజకీయ నేతలు దర్శనం తరువాత వర్షాలు పడాలి అని కోరుకునే వారని, 2014 తరువాత రైతాంగం అంత సంతోషంగా ఉన్నారని అన్నారు. అమ్మవారు భవిష్యవాణిలో బోనాలు కార్యక్రమం బాగా జరిగింది అని చెప్పడం సంతోషంగా ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బోనాలకు అన్ని డిపార్ట్మెంట్ లు సహకరించాయని, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఎటువంటి ఆటంకం లేకుండా ఏర్పాట్లు జరిగాయన్నారు. సాయంత్రం 7 గంటలకు మళ్ళీ ఫలహారం బండ్ల ఊరేగింపు జరుగుతుందని మంత్రి తలసాని తెలిపారు.
TS Rain Alert: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్