Fire in Balanagar: హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం ఘటన మరువక ముందే నగరంలోని బాలానగర్ పీఎస్ పరిధిలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐడిపిఎల్ కాలనీ డీమార్ట్ వెనకాల గల లైఫ్ స్పేసెస్ అపార్ట్ మెంట్ నాలుగవ ఫ్లోర్ లో షార్ట్ సర్క్యూట్ అయి రాత్రి 11 గంటలకు సమయంలో మంటలు ఎగసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో భారీగా పొగలు అలుముకున్నాయి. అప్రమత్తమైన పోలీసు ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. ఎలాంటి ప్రాణ నష్టం గాని ఆస్తి నష్టం గాని జరగలేదని బాలనగర్ పోలీసులు పేర్కొన్నారు. అయితే స్వల్పంగా ఫర్నిచర్ మాత్రం మంటలకు గురైనట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో అక్కడ నివసిస్తున్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
Read also: TS Rain Alert: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో నిన్న భారీ అగ్నిప్రమాదం ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. పాళికా బజార్‌లోని ఓ బట్టల షాపులో అకస్మాత్తుగా మంటలు చలరేగాయి. అక్కడే వున్న ఓ బట్టల షాపులో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో అక్కడ దట్టంగా పొగ అలుముకుంది. బట్టల దుకాణం పక్కనే ఉన్న లాడ్జ్ ఉండటంతో ఫైర్ సిబ్బంది ఖాళీ చేయించారు. పొగలు ఇతర షాపులోకి వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. ఈ సంఘటన పై సమాచారం తెలిసిన వెంటనే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అక్కడికి వెళ్లారు. పరిస్థితుల్ని పరిశీలించారు. ఎవరికి ఎటువంటి హానీ జరగలేదని తెలిపారు. సకాలంలో ఫైర్ సిబ్బంది రావడంతో ప్రమాదం తప్పిందని అన్నారు. పక్కనే వున్న లాడ్డీలో వున్న వారందరిని సురక్షితంగా పోలీసులు, ఫైర్ సిబ్బంది బయటకు తీసుకు వచ్చారని అన్నారు.
RamaJanma Bhumi: 24 జనవరి నుంచి భక్తులకు రామ్‌లాలా దర్శనభాగ్యం