Local Body Elections : స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో విచిత్ర సంఘటన
- ఎస్టీ జనాభా లేకపోయినా ఎస్టీ రిజర్వేషన్ కేటాయింపు
- సర్పంచ్, మూడు వార్డులకు నామినేషన్లు లేవు
- ఐదు వార్డులకు మాత్రమే ఎన్నికలు
- రీనోటిఫికేషన్ కోరుతున్న గ్రామస్తులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరంగల్ జిల్లా సంగెం మండలం వంజర పల్లి గ్రామంలో రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది.. గ్రామంలో 375 మంది జనాభా వున్న గ్రామంలో ఎస్టీ జనాభా ఏ ఒక్కరూ లేనప్పటికీ సర్పంచ్, మూడు వార్డు స్థానాలకు ఎస్టీ రిజర్వేషన్ను ఎన్నికల అధికారులు కేటాయించారు. దీంతో గ్రామంలో సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేయడానికి ఏ ఒక్కరు లేకపోవడంతో సర్పంచ్ తో పాటు మూడు వార్డు సభ్యులకు నామినేషన్ దాఖలు కాలేదు. ఎన్నికలు కేవలం 5 వార్డులకు మాత్రమే జరగనున్నాయి. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో వరంగల్ జిల్లాలోని వంజరపల్లి గ్రామం చర్చనీయంశంగా మారింది.
Omar Abdullah: ఇండియా కూటమి ‘‘వెంటిలేటర్’’పై ఉంది.. కాంగ్రెస్ పక్షాల ఆగ్రహం, బీజేపీ హ్యాపీ..
Also Read
- Bandi Sanjay : యోగితో బండి సంజయ్ భేటీ.. తెలంగాణపై కీలక చర్చ.!
- Khelo India : ఖేలో ఇండియాకి భారీ నిధులు.. భారత క్రీడారంగానికి సరికొత్త వెలుగులు..
- YS Viveka M*urder Case: వైఎస్ వివేకా కేసులో ఈడీ కీలక ప్రకటన.. అవినాష్ రెడ్డి ఇంట్లో రూ.24 లక్షలు సీజ్
- Drug Syndicate : డ్రగ్స్ రాజధానిపై 'ఈగల్ ఫోర్స్' ఉక్కుపాదం.. రూ.6 కోట్ల ఆస్తులు జప్తు.!
నలుగురు వార్డు సభ్యులకు బీసీ ఒకటి, 4 ఎస్సీ కేటాయించడం జరిగింది. ఈ స్థానాలకు మాత్రమే నామినేషన్లు దాఖలయ్యాయి. గ్రామంలో లేని జనాభా కు సర్పంచ్ తో పాటు వార్డు సభ్యులకు ఎస్టీ రిజర్వేషన్ కేటాయించడంపై గ్రామస్తులు ఎన్నికల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2018లో గ్రామ పంచాయతీగా ఏర్పడ్డ వంజనపల్లి గ్రామపంచాయతీ గత ఎన్నికల్లో సర్పంచ్ స్థానానికి బీసీ రిజర్వేషన్లు కేటాయించారు.
ప్రస్తుతం ఎస్టీ రిజర్వేషన్ కేటాయించడంతో గ్రామంలో సర్పంచ్ తో పాటు మూడు వార్డులకు ఎన్నికలు నిలిచిపోయాయి. అధికారులు రిజర్వేషన్ను మార్చి రీనోటిఫికేషన్ ఇస్తే గ్రామంలో సర్పంచ్ తో పాటు మూడు వార్డు సభ్యుల అభ్యర్థులను ఎన్నుకుంటామని గ్రామస్తులు తెలుపుతున్నారు. గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. రాబోయే రోజుల్లో గ్రామానికి రీ నోటిఫికేషను ఇస్తారా లేదా అధికారులు ఎన్ని నిర్ణయం తీసుకుంటారోనని గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు.
West Bengal: బాబ్రీ మసీదు తరహాలో పశ్చిమ బెంగాల్లో మసీదు నిర్మాణానికి శంకుస్థాపన..
తాజావార్తలు
-
Rahul Gandhi: పెల్లెట్ గన్ ఘటనపై రాహుల్ గాంధీ ధర్నా.. ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు
-
Bandi Sanjay : యోగితో బండి సంజయ్ భేటీ.. తెలంగాణపై కీలక చర్చ.!
-
India Forex Reserves: విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భారత్‌కు బిగ్ బూస్ట్.. బంగారం నిల్వలు కూడా భారీ పెరుగుదల..
-
Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
-
Iran: ‘యుద్ధం ముగిస్తేనే మంచిది’.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!