Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
- మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో విషాద ఘటన
- ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన కొడుకును కాపాడబోయి తండ్రి, తల్లి మృతి.
- కొండ అంచుపై నుంచి పడిన తండ్రి, కుమారుడు..
- ఇది చూసి తల్లి కూడా కొండపై నుంచి దూకి మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. కొడుకును కాపాడే క్రమంలో తల్లి, ఇది చూసిన తల్లి ముగ్గురూ మరణించారు. కొండ అంచున నిలబడి ఆత్మహత్య చేసుకుంటానని కొండపైకి వెళ్లిన 18 ఏళ్ల కునాల్‌ను కాపాడేందుకు ప్రయత్నించిన అతడి తండ్రి మురళీధర్ చాంద్గుడే ప్రాణాలు కోల్పోగా.. కొద్దిసేపటికే తల్లి సంగీత కూడా కొండపై నుంచి పడిపోయి మృతి చెందారు. దీంతో ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. ఖవ్డా హిల్ వద్ద శుక్రవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. పోలీసుల చెబుతున్న వివరాల ప్రకారం.. కునాల్ ఐఫోన్ కొనుగోలు చేశాడు. అయితే దాని ఈఎంఐలు చెల్లించేందుకు కుటుంబ సభ్యులను డబ్బులు అడుగుతున్నాడు. తాజా ఈఎంఐ చెల్లింపు విషయంలో తండ్రితో కునాల్‌కు వాగ్వాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
దేవ్లాయ్ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల యువకుడు ఉదయం 10 గంటలకు కొండ అంచుకు వెళ్లి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దాదాపు 3 గంటల పాటు యువకుడిని గ్రామస్తులు, బంధువులు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. తన భవిష్యత్తు, అమ్మానాన్నల గురించి ఆలోచించాలని కోరారు. అయినప్పటికీ యువకుడు కొండ అంచుపై నుంచి కదలలేదు. చివరకు 15-20 నిమిషాల్లో తండ్రి కొండపైకి ఎక్కి కొడుకును వెనక్కి తీసుకురావాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇద్దరు కొండ అంచు నుంచి జారిపడి మరణించారు. తీవ్ర ఆందోళనకు గురైన తల్లి కూడా కొండ పై నుంచి నుంచి పడిపోయింది. ఈ సంఘటనలో ముగ్గురూ మరణించారు.
Also Read
- Sam Pitroda: ‘‘ప్రధాని మోడీ ఫోన్లు ట్యాప్ చేయరు’’.. రాహుల్‌కు భిన్నంగా సామ్ పిట్రోడా కామెంట్స్.!
- Delhi Police: రామ్‌లీలా మైదానంలో సభలకు కొత్త రూల్స్.. ఢిల్లీ పోలీస్ షాకింగ్ నిర్ణయం!
- Sheikh Hasina Return: హామీ ఇస్తేనే హసీనాను పంపిస్తాం.. బంగ్లాదేశ్‌కు భారత్ షరతులు!
- Supriya Sule: ఎన్సీపీ విలీనంపై సస్పెన్స్‌కు తెర.. ఆ రోజు ఏం జరిగిందో చెప్పిన సుప్రియా సూలే!
ఘటనా స్థలంలో గ్రామస్తులతో పాటు పోలీసులు, ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా యువకుడికి నచ్చ చెప్పి, కొండ నుంచి దిగేలా ప్రయత్నించారు. చివరకు ఎవరి ప్రయత్నాలు ఫలించలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. తల్లిదండ్రులు, ఇతరులు యువకుడికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారని, అయినప్పటికీ అతనున వారి మాట వినకుండా కొండ అంచునే నిలబడ్డాడని చెప్పారు. తల్లి కూడా తన కొడుకును కొండ అంచు నుంచి రావాలని పదే పదే వేడుకున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Homemade Rava: బయట కొనే రవ్వలో మైదా కల్తీ, పురుగుల భయమా? ఇంట్లోనే స్వచ్ఛమైన రవ్వ చేసుకోండిలా!
-
Microsoft Outage: 36 గంటల తర్వాత గాడినపడ్డ మైక్రోసాఫ్ట్ సేవలు.. గంటకు మిలియన్ల నష్టం!
-
NTRxAnilRavipudi: అసలు ఎవరూ ఊహించని కాంబో.. అనిల్ రావిపూడితో ఎన్టీఆర్ నవ్వుల జాతర!
-
AP Assembly: పేపర్‌లెస్ దిశగా ఏపీ అసెంబ్లీ.. మంత్రుల పీఎస్‌లకు ‘నేషనల్ ఈ-విధాన్’ (NeVA) శిక్షణ..
-
Singur Project: సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి విడుదల.. రెండు గేట్లు ఎత్తిన అధికారులు
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!