Bandi Sanjay : యోగితో బండి సంజయ్ భేటీ.. తెలంగాణపై కీలక చర్చ.!
- అరగంటకుపైగా సాగిన కీలక భేటీ
- తెలంగాణలో బీజేపీ పరిస్థితిపై ఆరా
- డబుల్ ఇంజిన్ సర్కారుపై యోగి వ్యాఖ్యలు
- యూపీలో మళ్లీ బీజేపీదే అధికారం: యోగి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay : ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు (శుక్రవారం) సాయంత్రం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కలిశారు. కేంద్ర పారామిలటరీ అయిన సశస్త్ర సీమా బల్ కు చెందిన పలు అభివ్రుద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం నేరుగా లక్నోలోని సీఎం అధికార నివాసానికి వెళ్లిన కేంద్ర మంత్రి బండి సంజయ్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. దాదాపు అరగంటకుపైగా వీరిద్దరి భేటీ జరిగింది.
ప్రధానంగా తెలంగాణలో పార్టీ పరిస్థితి, యూపీ ఎన్నికలపై చర్చ జరిగింది. తెలంగాణ అభివ్రుద్ధికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ పూర్తిగా సహకరిస్తున్నారని యోగి తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే తెలంగాణకు మరింత మేలు జరుగుతుందని ఉత్తర ప్రదేశ్ ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. యూపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ కొనసాగడంవల్ల మోదీ సహకారంతో పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివ్రుద్ధి చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడితే రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, ప్రజలకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
Also Read
- JNTU Sultanpur : జేఎన్టీయూ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఇద్దరు సీనియర్లు సస్పెండ్
- Bollaram Army Weapons Theft Case : బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీలో ట్విస్ట్.. కీపర్లేదే కీలక పాత్ర.!
- Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
- Eatala Rajendar: జ్ఞానేష్ కుమార్ ఎందుకు రాజీనామా చెయ్యాలి?
తెలంగాణలో బీజేపీకి సానుకూల వాతావరణం ఉందని, నాయకులంతా కలిసికట్టుగా పని చేస్తే అధికారంలోకి కచ్చితంగా వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు. త్వరలో ఉత్తర ప్రదేశ్ లో శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయని, మోదీ నాయకత్వంలో ముచ్చటగా మూడవ సారి కాషాయ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
JNTU Sultanpur : జేఎన్టీయూ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఇద్దరు సీనియర్లు సస్పెండ్
-
Student Protests: రేప్ నుంచి దెయ్యం వరకు.. పుకార్లతో రగిలిపోతున్న యూనివర్సిటీలు.!
-
Bollaram Army Weapons Theft Case : బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీలో ట్విస్ట్.. కీపర్లేదే కీలక పాత్ర.!
-
Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!