16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
- ప్రపంచంలోనే తొలి వైడ్ స్క్రీన్ క్యాండీబార్ స్మార్ట్‌ఫోన్..
- 6.39 అంగుళాల OLED డిస్ప్లే, 16:9.5 యాస్పెక్ట్ రేషియో, 2232 × 1320 పిక్సెల్స్ రిజల్యూషన్..
- 7,000mAh బ్యాటరీ, HarmonyOS 7 ఆపరేటింగ్ సిస్టమ్..
- ఆగస్టు 28 నుంచి స్టోర్లలో ప్రీ-సేల్స్...
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Huawei Pura X View: హువావే (Huawei) నుండి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకరానుంది. Huawei Pura X View పేరుతో రానున్న ఈ ఫోన్‌ను ప్రపంచంలోనే తొలి వైడ్ స్క్రీన్ క్యాండీబార్ స్మార్ట్‌ఫోన్‌గా కంపెనీ పేర్కొంది. కంటెంట్ చూడడం, చదవడం, గేమింగ్, ప్రొడక్టివిటీ వంటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్‌ను తయారుచేసినట్లు కంపెనీ తెలిపింది.
16:9.5 యాస్పెక్ట్ రేషియోతో డిస్ప్లే:
ఈ కొత్త స్మార్ట్ ఫోన్ లో 6.39 అంగుళాల OLED డిస్ప్లే ఉంటుంది. ఇది 2232 × 1320 పిక్సెల్స్ రిజల్యూషన్, 16:9.5 యాస్పెక్ట్ రేషియోతో వస్తుంది. సాధారణ స్మార్ట్ఫోన్లతో పోలిస్తే వెడల్పైన స్క్రీన్‌ను అందించడం ఈ ఫోన్ ప్రత్యేకత. స్క్రీన్ బెజెల్స్ కేవలం 1.05 మి.మీ.గా ఉండగా.. స్క్రీన్-టు-బాడీ రేషియో 96.1%గా ఉంది. డిస్ప్లే గరిష్ఠంగా 6,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను అందిస్తుంది. వీడియోలు చూడటం, ఈ-బుక్స్ చదవడం, గేమింగ్, మల్టీటాస్కింగ్ వంటి పనులకు ఈ వైడ్ స్క్రీన్ మరింత అనుకూలంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది.
Also Read
- 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
- Huawei Mate 90 Pro Max: హువావే Mate 90 Pro Max లాంచ్.. 200MP RYYB కెమెరా, 6,800mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్ప్లే
- JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
భారీ బ్యాటరీ & ఆపరేటింగ్ సిస్టమ్:
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 7,000mAh బ్యాటరీని అందించారు. భారీ బ్యాటరీ కారణంగా ఎక్కువసేపు వీడియోలు చూడటం, గేమింగ్ చేయడం, ఇతర పనులు చేయడం వంటి వాటికి మెరుగైన బ్యాకప్ లభించే అవకాశం ఉంది. ఫోన్ మందం 6.68 మి.మీ.గా ఉండగా, బరువు 201 గ్రాములుగా ఉంది. ఈ మొబైల్ HarmonyOS 7 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. వైడ్ స్క్రీన్‌ను దృష్టిలో పెట్టుకుని వీడియో, రీడింగ్, గేమింగ్, ప్రొడక్టివిటీ వంటి విభిన్న వినియోగ పరిస్థితులకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.
ఆగస్టు 28 నుంచి ప్రీ-సేల్స్:
Huawei Pura X Viewను నాలుగు కలర్ ఆప్షన్లలో అందిస్తున్నారు. లీప్ షాడో రెడ్, లినెన్ గ్రే, జీరో డిగ్రీ వైట్, ఫాంటమ్ నైట్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ లభించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన రిజర్వేషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆగస్టు 28 నుంచి స్టోర్లలో అనుభవ కార్యక్రమాలతో పాటు ప్రీ-సేల్స్ కూడా ప్రారంభం కానున్నాయి. అయితే ఫోన్ ధర, అంతర్జాతీయ మార్కెట్లలో లభ్యత వంటి వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించాల్సి ఉంది. లీకైన సమాచారం ప్రకారం.. ఈ మొబైల్ ప్రారంభ ధర 5,999 యువాన్లు ఉండే అవకాశం ఉంది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.72 వేల వరకు ఉంటుంది. అయితే ఇది అధికారిక ధర కాదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న లీక్ ఆధారంగా అంచనా మాత్రమే. ఈ ఫోన్ మూడు RAM, స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వాటి అంచనా ధరలు ఇలా ఉన్నాయి..
* 12GB RAM + 256GB స్టోరేజ్: 5,999 యువాన్లు.
* 12GB RAM + 512GB స్టోరేజ్: 6,499 యువాన్లు.
* 12GB RAM + 1TB స్టోరేజ్: 7,499 యువాన్లు.
తాజావార్తలు
-
TG TET 2026 : టీచర్లకు గుడ్ న్యూస్.. ప్రత్యేక TG TET-2026-II నోటిఫికేషన్.!
-
Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
-
Divya Mittal: దివ్యా మిట్టల్ కోసం కాంగ్రెస్, ఎస్పీ పోటీ? యూపీలో మాజీ IAS సంచలనం..
-
Tollywood Box Office: టాలీవుడ్‌ను ముంచేసిన సెప్టెంబర్.. నాని ‘ది ప్యారడైజ్’ గట్టెక్కుతుందా?
-
US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?