Drug Syndicate : డ్రగ్స్ రాజధానిపై ‘ఈగల్ ఫోర్స్’ ఉక్కుపాదం.. రూ.6 కోట్ల ఆస్తులు జప్తు.!
- 15 మంది కీలక నిందితుల అరెస్ట్
- 9 ఎకరాలకు పైగా భూములు సీజ్
- సతారాలో ఆల్ప్రాజోలం ఫ్యాక్టరీపై దాడి
- 32.5 కిలోల డ్రగ్ నిల్వలు స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drug Syndicate : తెలంగాణలో కల్తీకల్లు, ఆల్ప్రాజోలం అక్రమ రవాణా నెట్‌వర్క్‌పై తెలంగాణ ఈగల్ ఫోర్స్ (Eagle Force) , బోధన్ పోలీసులు ఉమ్మడిగా విరుచుకుపడ్డారు. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరించిన భారీ అంతర్రాష్ట్ర డ్రగ్ సిండికేట్‌ను మట్టుబెట్టడమే కాకుండా, డ్రగ్స్ వ్యాపారంతో అక్రమంగా సంపాదించిన ఏకంగా రూ.6 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు 15 మంది కీలక నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
రూ.6 కోట్ల ఆస్తుల జప్తు.. ఫ్యాక్టరీలు, భూములు సీజ్
డ్రగ్స్ ద్వారా వచ్చిన నల్లధనంతో కూడబెట్టిన ఆస్తులపై ఎన్డీపీఎస్ (NDPS) చట్టం సెక్షన్ 68(F) ప్రకారం పోలీసులు చర్యలు చేపట్టారు. నిందితులకు చెందిన 9.06 ఎకరాల వ్యవసాయ భూమి, 1,370 చదరపు గజాల ప్లాట్లతో పాటు రవాణాకు ఉపయోగించిన వాహనాలు , మహారాష్ట్రలోని కేమికల్ ఫ్యాక్టరీని అధికారులు జప్తు చేశారు. ప్రభుత్వ లెక్కింపు ప్రకారం వీటి విలువ రూ.2.5 కోట్లు కాగా, ప్రస్తుత బహిరంగ మార్కెట్ విలువ సుమారు రూ.6 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Also Read
కల్తీకల్లు వికటించి తీవ్ర అస్వస్థత.. వెలుగులోకి దందా
ఉమ్మడి నిజామాబాద్, మెదక్ , సిద్ధిపేట జిల్లాల్లో కల్తీకల్లుకు ఆల్ప్రాజోలం కెమికల్ వినియోగిస్తున్నట్లు పోలీసులు పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు. నస్రుల్లాబాద్‌లో కల్తీకల్లు తాగి 68 మంది, గాంధారి ప్రాంతంలో 15 మంది తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఈ అంతర్రాష్ట్ర దందా వెలుగులోకి వచ్చింది. సిద్ధిపేటలో కల్తీకల్లుపై మూడు కేసులు నమోదు కాగా, జహీరాబాద్ లో నిఘా పెట్టి 750 గ్రాముల ఆల్ప్రాజోలం, రూ.7.50 లక్షల నగదుతో పాటు క్రెటా కారును అధికారులు సీజ్ చేశారు.
మహారాష్ట్ర సతారాలో తయారీ కేంద్రం ధ్వంసం
బోధన్ పరిధిలో జరిపిన మెరుపు దాడిలో రూ.25 లక్షల విలువైన 2.5 కిలోల ఆల్ప్రాజోలం, ఒక కారు, రూ.25 లక్షల నగదు , 8 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అక్కడ లభించిన కీలక ఆధారాల ఆధారంగా మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చేరుకున్న పోలీసులు ‘సూర్య ప్రభ ఫార్మా కెమ్’ (Surya Prabha Pharma Chem) ఫ్యాక్టరీపై దాడి చేశారు. అక్కడ అక్రమంగా తయారు చేస్తున్న 30 కిలోల ఆల్ప్రాజోలంతో పాటు రూ.12 లక్షల నగదు , సుమారు రూ.4 కోట్ల విలువైన కెమికల్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా ఒక్క ఆపరేషన్లోనే 32.5 కిలోల ఆల్ప్రాజోలం నిల్వలను పోలీసులు రికవరీ చేశారు. డ్రగ్ వ్యాపారం చేస్తూ అక్రమ మార్గాల్లో ఆస్తులు కూడబెడితే ఎంతటివారినైనా వదిలిపెట్టేది లేదని, వారి ఆస్తులన్నింటినీ సీజ్ చేస్తామని ఈగల్ ఫోర్స్ అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు.
తాజావార్తలు
-
Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
-
YS Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు..
-
Putin Praises PM Modi: ప్రధాని మోడీపై పుతిన్ ప్రశంసలు.. ఉక్రెయిన్ సంక్షోభంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు
-
Anil Ravipudi : అనిల్ రావిపూడి చుట్టూ క్రేజీ రూమర్స్
-
CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?