KTR: ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో నిర్వహించిన కీలక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని పీడిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై వరుస పోరాటాలకు సిద్ధం కావాలి అని పిలుపునిచ్చారు. హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్ ద్రోహాన్ని ప్రజలకు వివరించండి అన్నారు. వాగు దాటే దాక ఓడ మల్లన్న.. వాగు దాటినంక బోడి మల్లన్న అన్నట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన ఉందన్నారు. వరంగల్ సభతో కాంగ్రెస్ అంతానికి ఆరంభం మొదలైంది.. కాంగ్రెస్ అరాచకాలను ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఎదుదుర్కొంటందని కేటీఆర్ తెలిపారు.
Read Also: Trump: సౌదీ అరేబియాలో ట్రంప్ పర్యటన.. భార్య మెలానియా లేకుండానే టూర్
అయితే, రైతుల ఆత్మహత్యలు, వారి సమస్యల పరిష్కారంపై రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ విస్తృతంగా పోరాటాలు చేసేందుకు సిద్ధమవుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. మోసానికి మారుపేరైన కాంగ్రెస్ నైజాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలును ఎలా విస్మరించిందో ప్రజలకు వివరిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో నెలకున్న సమస్యలను ప్రజలకు తెలిసేలా బీఆర్ఎస్ ముందుకు సాగుతుందని కేటీఆర్ వెల్లడించారు.