Legislative Council: మండలిలో జీవన్ రెడ్డి vs తలసాని.. ముందు నీ శాఖ చూసుకో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
War Of Words Between Jeevan Reddy Talasani Srinivas Yadav: తెలంగాణ అసెంబ్లీలోని శాసనమండలిలో మంత్రి తలసాని, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిల మధ్య ఒక మినీ యుద్ధమే చోటు చేసుకుంది. బీసీ వెల్ఫేర్ ప్రశ్నపై సభ్యులు, మంత్రి మాట్లాడుతున్న సమయంలో.. మంత్రి తలసాని మధ్యలో కల్పించుకొని మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల మీద ప్రశ్నలు వచ్చినప్పుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. గతంలో పాలకు ఎవ్వరూ ఇన్సెంటివ్ ఇవ్వలేదని.. తమ ప్రభుత్వం మాత్రమే ఇచ్చిందన్నారు. ఇందుకు జీవన్ రెడ్డి బదులిస్తూ.. నువ్వు ముందు నీ శాఖకు సంబందించిన పనులు చూసుకో అని, తర్వాత వేరే శాఖ మీద మాట్లాడు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను ఆల్రెడీ ఎస్సీ వెల్ఫేర్ గురించి మాట్లాడానని, అప్పుడు నువ్వు నిద్రపోయినట్టున్నావని ఎద్దేవా చేశారు. నీ శాఖలో పాలకు ఇన్సెంటివ్ రూ.4 ఇస్తానని చెప్పి నాలుగేళ్లు అవుతుందని, అది ఎప్పుడు ఇస్తారో చెప్పు అని నిలదీశారు. ఇంతలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అందుకొని.. ఒక లీటర్ పాలకు ఒక రూపాయి ఇన్సెంటివ్ ఇవ్వాలని సీఎం కేసిఆర్‌ను కోరితే.. రూ. 4 ఇచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.
Turkey Earthquake: టర్కీలో 28 వేలకు చేరిన మరణాల సంఖ్య.. రెట్టింపు ఉంటాయని యూఎన్ అంచనా….
Also Read
- Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
అంతకుముందు.. బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. వసతుల కల్పన చేయకపోవడంతో ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదని.. అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకుల పాఠశాలలకు శాశ్వత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. అందుకు మంత్రి కొప్పుల ఈశ్వర్ బదులిస్తూ.. ఉమ్మడి రాష్ట్రంలో 298 రెసిడెన్షియల్ స్కూల్స్‌లో లక్ష 40 వేల మంది విద్యార్థులు మాత్రమే చదివేవారని, తెలంగాణలో 1004 రెసిడెన్షియల్ స్కూల్స్‌లో 5 లక్షల 31 వేల మంది విద్యార్థులు చదువుతున్నారని అన్నారు. 268 ఎస్సీ గురుకులాల్లో 1,53,863 మంది విద్యార్థులు, 310 బీసీ గురుకులాల్లో 1,65,110 మంది, 183 ఎస్టీ గురుకులాల్లో 72,898 మంది, 204 మైనారిటీ గురుకులాల్లో 125218 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారన్నారు. గురుకుల పాఠశాల పని వేళల మార్పుపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్ టీచర్స్‌కు పదోన్నతుల కల్పన ఆలోచన లేదన్నారు. గురుకులాలకు అద్దె భవనాలు సమస్య కాదని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందా లేదా అనేది మాత్రమే చూడాలన్నారు. సీఎం కేసీఆర్‌తో చర్చించి.. దశల వారిగా గురుకుల పాఠశాలలకు శాశ్వత భవనాల నిర్మాణాలకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
Hyderabad Fake Baba Arrest: దొంగ బాబా అరెస్ట్.. 8వ పెళ్లి చివరి క్షణంలో బాగోతం బట్టబయలు
తాజావార్తలు
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!