MLC Kavitha : తనపై చేసిన అవమానకర వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, తీన్మార్ మల్లన్నపై శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి అధికారికంగా ఫిర్యాదు చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, అసభ్య వ్యాఖ్యలు చేయడం తగదని పేర్కొంటూ, మల్లన్నను ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సంస్కృతిలో మహిళలకు ప్రత్యేక గౌరవం ఉంటుందని, బోనం ఎత్తే ఆడబిడ్డలను అమ్మవారిలా చూస్తామన్నారు. అలాంటి రాష్ట్రంలో ఒక ఎమ్మెల్సీ బాధ్యత…
నల్గొండ జిల్లాలో మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా.. సుంకిశాల ప్రాజెక్టును మంత్రులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సందర్శించారు. కూలిన రిటైనింగ్ సైడ్వాల్ను పరిశీలించారు. నీట మునిగిన ఇన్టెక్ వెల్, పంపింగ్ స్టేషన్ను మంత్రులు పరిశీలించారు.
నల్లగొండ జిల్లాలో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. మా పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. సలహాలు, సూచనల వరకే పరిమితం అవుతాను.. మూడవ సారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం.. పార్టీలో చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉండటం సహజం.
ప్రతిపక్ష పార్టీలను, ప్రభుత్వాలను కూల దొస్తున్న ఘనత ప్రధాని మోడీకే దక్కుతుంది అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు రంగాల్లో 1, 2, 3 స్థానాల్లో ముందుంది అని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రభాగాన నిలబెట్టిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కుతుందన్నారు. ప్రధాని స్థాయి దిగజారి మా ముఖ్యమంత్రిని, ఆయన కుటుంబంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని గుత్తా మండిపడ్డారు.
కేటీఆర్ పై కుట్రలు చేస్తున్నారు.. ప్రతిపక్షాల చర్యలు సరిగా లేవని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. నల్లగొండ జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో నియంత పాలన సాగుతుందని అన్నారు.