NTV Telugu Site icon

Telangana Election: ఏంటీ.. ఈ ఊళ్లో పోలింగ్‌ జరగలేదా? మరీ..!

Adilabad No Polling

Adilabad No Polling

Telangana Election: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చెదురుమదురు సంఘటనలు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఓటింగ్ సాఫీగా సాగింది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఓటు వేసేందుకు ఓటర్లు సుముఖత చూపలేదు. పోలింగ్‌ను పూర్తిగా బహిష్కరించారు. గతవారం రాజస్థాన్‌లోని ఓ గ్రామంలో ఇదే పరిస్థితి నెలకొంది. మూడు దశాబ్దాలుగా వారికి సరైన రోడ్లు వేయడంలో నాయకులు చొరవ చూపకపోవడంతో ఓట్లు వేసేందుకు ఆసక్తి చూపడం లేదు. కానీ మన తెలంగాణాలో ఇలాంటి ఘటన జరగడం కొత్త చర్చకు దారి తీస్తోంది. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని తాంసి గ్రామం ఇటీవల గొల్లగడ్డ పేరుతో కొత్త పంచాయతీగా ఏర్పడింది. ఈ మండలంలో 26 గ్రామాలు ఉండగా ఓటు వేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. సాధారణంగా ఇక్కడ 80 శాతం ఓటింగ్ ఉన్నప్పటికీ ఓటు వేయకపోవడానికి ప్రధాన కారణం ఏమిటి?.

Read also: CPI Narayana: చంద్రబాబు లాగే కేటీఆర్‌ పరిస్థితి.. ప్రజలు బుద్ది చెప్తారు..

ఆదిలాబాద్ జిల్లాలో 79.86 శాతం ఓటింగ్ జరిగింది. అయితే కొన్ని గ్రామాల్లో నాయకుల తీరుపై ఓటర్లు విరుచుకుపడ్డారు. తమకు డబ్బులు పంచలేదని, సంక్షేమ కార్యక్రమాల్లో జాప్యం జరుగుతోందని కొద్ది మంది మాత్రమే ఓటింగ్‌లో పాల్గొన్నారు. కానీ రాజకీయ నాయకులు తమ ప్రాంతాన్ని పట్టించుకోవడం లేదని, ప్రచార సమయంలో కూడా ఎవరూ పలకరించలేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించారని గొల్లగడ్డ గ్రామస్తులు పోలింగ్‌ను బహిష్కరించారు. ఈ విషయం తెలుసుకున్న నాయకులు, అధికారులకు ఎంత చెప్పినా ఫలితం లేకపోయింది. కలెక్టర్ తమ వద్దకు వచ్చి న్యాయం చేస్తామని చెబితే పోలింగ్‌లో పాల్గొంటామని నిరసన తెలిపారు. ఎన్నికల విధుల్లో బిజీగా ఉండడంతో కలెక్టర్‌ ఫోన్‌లో మాట్లాడారు. కలెక్టర్‌తో మాట్లాడిన గ్రామస్తులు నమ్మకపోవడంతో ఓటు వేయడానికి భయపడి అక్కడే కూర్చున్నారు. దీంతో పోలింగ్ అధికారులు చేసేదేమీ లేక సాయంత్రం 5 గంటల వరకు విధులు నిర్వహించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Animal Movie Review: ‘యానిమల్‌’ మూవీ రివ్యూ!