మధుమేహం, రక్తపోటు లాంటివి రాకుండా చూసుకోవాలి. ఒకసారి వస్తే అంత తేలిగ్గా వదిలిపెట్టవు. జీవితకాలం వాటితో సావాసం చేయాల్సి ఉంటుంది.

షుగరు వస్తే పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుంది. చక్కెర తినకపోవడంద్వారా కొన్ని రకాల అనారోగ్యాలకు దూరంగా ఉండొచ్చని చాలామంది భావిస్తుంటారు. 

అలాకాకుండా మన జీవనశైలిలో కొన్ని కొన్ని మార్పులు చేసుకోవడంద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. తినడం, తాగడం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. 

డ్రైఫ్రూట్స్ ను డయాబెటిస్ డైట్ లో ఉంచుకోవడంవల్ల బ్లడ్ షుగరు లెవల్స్ తగ్గుతాయి. ప్రతిరోజు వీటిని తీసుకుంటుంటే అనేక రకాల అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. 

విటమిన్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, సహజ చక్కెరలు అధికంగా ఉంటాయి. డ్రైఫ్రూట్స్ లో అనేక గింజలు, ఎండిన పండ్లు విత్తనాలు ఉంటాయి. 

అంజీరాలను తీసుకోవడంవల్ల షుగరు కంట్రోల్ లో ఉంటుంది. వీటిల్లో ప్రొటీన్, మెగ్నీషియం, ఐరన్, ఫోలేట్, విటమిన్లు సీ, కే, ఏ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 

అంజీరా రక్తంలో చక్కెర లెవల్స్ ను అదుపులో ఉంచుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి. ఇందులో సహజమైన చక్కెర ఉంటుంది. యాంటీ ఆక్షిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. 

ఇన్సులిన్ ఉత్పత్తి చేసే ప్యాంక్రియాటిక్ బీటా కణాలతో సహా మిగిలిన కణాలపై రక్షిత ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటంవల్ల బరువు తగ్గుతారు. 

ఇంకా అనేకరకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చని పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు. ప్రతిఒక్కరు తమ రోజువారి డైట్ లో అంజీరాను భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.