Telangana Election: ఏంటీ.. ఈ ఊళ్లో పోలింగ్ జరగలేదా? మరీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Election: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చెదురుమదురు సంఘటనలు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఓటింగ్ సాఫీగా సాగింది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఓటు వేసేందుకు ఓటర్లు సుముఖత చూపలేదు. పోలింగ్‌ను పూర్తిగా బహిష్కరించారు. గతవారం రాజస్థాన్‌లోని ఓ గ్రామంలో ఇదే పరిస్థితి నెలకొంది. మూడు దశాబ్దాలుగా వారికి సరైన రోడ్లు వేయడంలో నాయకులు చొరవ చూపకపోవడంతో ఓట్లు వేసేందుకు ఆసక్తి చూపడం లేదు. కానీ మన తెలంగాణాలో ఇలాంటి ఘటన జరగడం కొత్త చర్చకు దారి తీస్తోంది. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని తాంసి గ్రామం ఇటీవల గొల్లగడ్డ పేరుతో కొత్త పంచాయతీగా ఏర్పడింది. ఈ మండలంలో 26 గ్రామాలు ఉండగా ఓటు వేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. సాధారణంగా ఇక్కడ 80 శాతం ఓటింగ్ ఉన్నప్పటికీ ఓటు వేయకపోవడానికి ప్రధాన కారణం ఏమిటి?.
Read also: CPI Narayana: చంద్రబాబు లాగే కేటీఆర్ పరిస్థితి.. ప్రజలు బుద్ది చెప్తారు..
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
ఆదిలాబాద్ జిల్లాలో 79.86 శాతం ఓటింగ్ జరిగింది. అయితే కొన్ని గ్రామాల్లో నాయకుల తీరుపై ఓటర్లు విరుచుకుపడ్డారు. తమకు డబ్బులు పంచలేదని, సంక్షేమ కార్యక్రమాల్లో జాప్యం జరుగుతోందని కొద్ది మంది మాత్రమే ఓటింగ్‌లో పాల్గొన్నారు. కానీ రాజకీయ నాయకులు తమ ప్రాంతాన్ని పట్టించుకోవడం లేదని, ప్రచార సమయంలో కూడా ఎవరూ పలకరించలేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించారని గొల్లగడ్డ గ్రామస్తులు పోలింగ్‌ను బహిష్కరించారు. ఈ విషయం తెలుసుకున్న నాయకులు, అధికారులకు ఎంత చెప్పినా ఫలితం లేకపోయింది. కలెక్టర్ తమ వద్దకు వచ్చి న్యాయం చేస్తామని చెబితే పోలింగ్‌లో పాల్గొంటామని నిరసన తెలిపారు. ఎన్నికల విధుల్లో బిజీగా ఉండడంతో కలెక్టర్ ఫోన్లో మాట్లాడారు. కలెక్టర్‌తో మాట్లాడిన గ్రామస్తులు నమ్మకపోవడంతో ఓటు వేయడానికి భయపడి అక్కడే కూర్చున్నారు. దీంతో పోలింగ్ అధికారులు చేసేదేమీ లేక సాయంత్రం 5 గంటల వరకు విధులు నిర్వహించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Animal Movie Review: ‘యానిమల్’ మూవీ రివ్యూ!
తాజావార్తలు
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
-
Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
-
Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!