గేమ్ చేంజర్ సినిమా యూనిట్ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితమే ఒక జీవో కూడా జారీ చేశారు గేమ్ చేంజర్ భారీ బడ్జెట్ సినిమా కావడంతో దానికి టికెట్ రేట్లు పెంచి అమ్ముకునే అవకాశం కల్పించాలంటూ కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ వెళ్లిన నిర్మాత దిల్ రాజు ప్రభుత్వాన్ని కోరారు. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ను కలిసి ఈ మేరకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇక ఈ నేపథ్యంలోనే గేమ్ చేంజర్ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పిస్తూ జీవో జారీ అయింది. కొద్దిసేపటికి క్రితం జారీ అయిన జీవో ప్రకారం 9వ తారీకు రాత్రి 1:00 కి స్పెషల్ బెనిఫిట్ షో వేసుకునే అవకాశం కల్పించారు. ఆ షోలకు జీఎస్టీతో కలిపి 600 రూపాయలకు టికెట్ రేటు ఫిక్స్ చేశారు.
Game Changer Pre Release Event: గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్
ఇక అలాగే పదవ తేదీన సినిమా 6 షోస్ వేసుకునేలా పర్మిషన్ ఇచ్చారు. ఉదయం నాలుగు గంటల ఆట నుంచి వేసుకునేలా పర్మిషన్స్ ఇచ్చారు. మల్టీప్లెక్స్ లకు జీఎస్టీతో కలిపి 175 రూపాయలు పెంచుకునే అవకాశం ఇచ్చారు. సింగిల్ స్క్రీన్ ధియేటర్లకు జీఎస్టీ తో కలిపి 135 రూపాయలు పెంచుకునే అవకాశం కల్పించారు. 11వ తేదీ నుంచి 23వ తేదీ వరకు రోజుకు ఐదు షోస్ వేసుకునే అవకాశం కల్పించారు. టికెట్ రేట్లు కూడా మొదటి రోజు ఎంత ఉంచారో 23వ తేదీ వరకు అంతే పెంచుకునేలా అవకాశం కల్పించారు.. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇప్పటివరకు రేట్లు పెంచుకునే అవకాశం కల్పిస్తారా లేదా? బెనిఫిట్ షోస్ వేస్తారా? లేదా? అనే విషయాల మీద క్లారిటీ లేదు. ఇటీవలే ముఖ్యమంత్రి బెనిఫిట్ షోస్ వేసుకునే అవకాశం లేదంటూ కామెంట్ చేయవలసిన నేపద్యంలో ఏం జరగబోతుందో చూడాలి.