Vijayashanti: ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 1న పాలమూరులో పర్యటించిన ప్రధాని అక్టోబర్ 3న ఇందూరులో పర్యటించారు. అయితే ఈ రెండు పర్యటనల్లో బీజేపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభలు నిర్వహించారు. అయితే తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశాలు శంఖారావాన్ని పూరించాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మోడీ ప్రసంగాలు కూడా అందుకు తగ్గట్టుగానే ఉన్నాయి. ఈ సమావేశాలకు బీజేపీకి చెందిన ముఖ్య నేతలంతా హాజరుకాగా.. మరికొంత మంది రాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా మహిళా నేత విజయశాంతి డుమ్మా కొట్టడంపై రకరకాల చర్చలు తెరపైకి వస్తున్నాయి. గతంలో పలుమార్లు రాములమ్మ అసహనం వ్యక్తం చేసి సమావేశాలను మధ్యలోనే వెళ్లిపోయిన సందర్బాలు ఉన్నాయి. అంతే కాదు రాష్ట్ర నాయకత్వంపై కొంత అసంతృప్తిగా ఉన్నానని బహిరంగంగానే చెప్పారు. ఈ నేపథ్యంలో మోడీ బహిరంగ సభలకు రాకపోవడంపై శ్రేణుల్లో చర్చ మొదలైంది. పార్టీ తీరుపై రాములమ్మ అసంతృప్తితో ఉన్నారని రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Read also: Bathukamma Sarees: తెలంగాణ మహిళలకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ
అయితే ఒక్క ట్వీట్ తో వాటన్నింటికీ చెక్ పెట్టింది విజయశాంతి. పాలమూరులో జరిగిన సభపై ఏమాత్రం స్పందించని రాములమ్మ ఇందూరు సభపై ట్విట్టర్ లో స్పందించారు. కేసీఆర్ ఢిల్లీ టూర్ సీక్రెట్స్ అంటూ మోడీ చేసిన సంచలన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ క్రమంలో పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, కేటీఆర్ స్పందించిన తర్వాత విజయశాంతి తనదైన శైలిలో ట్వీట్ చేశారు. ప్రధాని మోడీ చెప్పినట్లే ఎన్డీయేలో చేరాలని కేసీఆర్ కోరి ఉండవచ్చని విజయశాంతి అన్నారు. అందులో నిజం తప్పక ఉండి ఉంటుందని తెలిపారు. 2009లో తెలంగాణలో మహాకూటమి పేరుతో కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసిన కేసీఆర్ కూడా కౌంటింగ్ బాక్సులు తెరవకముందే లూథియానాలో జరిగిన ఎన్డీయే ర్యాలీకి హాజరైన విషయం ప్రజలకు ఇప్పటికీ గుర్తున్నదని గుర్తు చేశారు. ఈ విషయంలో మోడీని కేటీఆర్ తిట్టాల్సిన అవసరం లేదన్నారు రాములమ్మ. దీంతో.. ఆమెపై వస్తున్న ఊహాగానాలన్నింటికీ ఒక్కసారిగా చెక్ పడింది. అయితే గతంలో పలుమార్లు పార్టీ మారడంపై స్పందించిన విజయశాంతి.. తాను పార్టీ మారేది లేదని తేల్చిచెప్పడమే కాకుండా ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై విస్మయం వ్యక్తం చేశారు.
మోడీ గారు చెప్పినట్లుగా NDA ల చేరుతామని కేసీఆర్ గారు అడిగి ఉండవచ్చు..
నిజమై తప్పక ఉండి ఉంటది..2009 ల కూడా తెలంగాణాల మహాకూటమి పేర కమ్యూనిష్టులుతో కలిసి పోటీ చేసిన కేసీఆర్ గారు కౌంటింగ్ డబ్బాలు తెరవక ముందే లూధియానా NDA ర్యాలీకి హాజరైన వాస్తవం ప్రజలకు ఇంకా జ్ఞాపకమున్నది..
కేటీఆర్… pic.twitter.com/MAZzBpDX5f
— VIJAYASHANTHI (@vijayashanthi_m) October 3, 2023