Bathukamma Sarees: తెలంగాణ మహిళలకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bathukamma Sarees: తెలంగాణ మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నేటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీకి సిద్ధమైంది. తెలంగాణలో దసరా పెద్ద పండుగ. తొమ్మిది రోజుల పాటు బతుకమ్మలను పేర్చి గౌరమ్మను మహిళలు పూజిస్తారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతి సంవత్సరం మహిళలకు బతుకుమ్మ చీరలను పంపిణీ చేస్తుంది. ఈ ఏడాది కూడా చీరలు పంపిణీ చేసేందుకు సమాయత్తం కావడంతో ఇప్పటికే అన్ని జిల్లాలకు చీరలు చేరాయి. ఈ ఏడాది చేనేత సంఘాల ఆధ్వర్యంలో రూ.354 కోట్లతో 1.02 కోట్ల చీరలను బాలికలకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేశారు. టెక్స్టైల్ శాఖ గతంలో కంటే ఎక్కువ డిజైన్లు, రంగులు, వెరైటీల్లో చీరలను తయారు చేసింది. ఈ బతుకమ్మ చీరలను 250 డిజైన్లలో జరీ, వివిధ రంగుల కాంబినేషన్లతో ఆకర్షణీయంగా తయారు చేశారు. తమ శాఖ 100 శాతం పాలిస్టర్ ఫిలమెంట్ నూలు చీరలను థ్రెడ్ బార్డర్‌తో తయారు చేసిందని అధికారులు తెలిపారు.
Read also: Kushi : ఓటీటీలో అదరగొడుతున్న ఖుషి మూవీ.
Also Read
- Bhatti Vikramarka : తెలంగాణకు సూపర్ ఎల్ నినో ముప్పు.. డిప్యూటీ సీఎం భట్టి కీలక విజ్ఞప్తి
- Pashamylaram Drug Raid: తెలంగాణలో భారీగా డ్రగ్స్ ముడిసరుకు ఫ్యాక్టరీ గుట్టురట్టు..
- Uttam Kumar Reddy : కాళేశ్వరం పునరుద్ధరణకు ఆర్మీ ఇంజనీర్.. బీఆర్ఎస్ తీరుపై మంత్రి ఉత్తమ్ ఫైర్
- Drugs Seized : హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత... భోపాల్ బస్సులో రూ.1.1 కోట్ల విలువైన మెథాంఫెటమిన్ సీజ్!
చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల తదితర ప్రాంతాల నేత కార్మికుల నుంచి వీటిని తయారు చేశారు. రాష్ట్రంలో నేటి నుంచి 18 ఏళ్లు నిండిన బాలికలకు చీరల పంపిణీకి టెస్కో, తెలంగాణ చేనేత జౌళి శాఖ సిద్ధమయ్యాయి. వీటిని రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయనున్నారు. లబ్ధిదారులు ఫోన్ నంబర్లతో పాటు రేషన్ కార్డు, ఆధార్ కార్డు నకలు పత్రాలను అందించాలి. సెలవులు మినహా మిగిలిన రోజుల్లో ఈ చీరలను పంపిణీ చేయనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బతుకమ్మ పండుగ వేడుకలు తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రతీక. మహిళలు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ పండుగకు ఆడపిల్లలు, అబ్బాయిలు అందరూ కొత్త చీరలు కట్టుకోవాలనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ 2017 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఏటా కోటి మంది మహిళలకు చీరలు పంపిణీ చేయగా, ఈ ఏడాది కూడా 1.02 కోట్ల చీరలను తయారు చేశారు. 2017 నుంచి 2022 వరకు 5.81 కోట్ల చీరలను ఆడపిల్లలకు అందించారు.
Flash Floods in Sikkim: సిక్కింలో ఆకస్మిక వరదలు.. 23 మంది ఆర్మీ జవాన్లు గల్లంతు!
తాజావార్తలు
-
Harshith Reddy: ఆ ఒక్క రీజన్‌తో ప్రభాస్ అన్న మా సినిమాను సపోర్ట్ చేశాడు..
-
Jammu Kashmir: ‘‘కాశ్మీర్‌ను పాకిస్తాన్ రక్షిస్తోంది’’.. ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం..
-
Viral : స్టంప్ మైక్‌లో రికార్డైన తిలక్, నితీష్ తెలుగు ముచ్చట్లు.. తెలుగు కుర్రాళ్ల మాటలు లీక్
-
Bhatti Vikramarka : తెలంగాణకు సూపర్ ఎల్ నినో ముప్పు.. డిప్యూటీ సీఎం భట్టి కీలక విజ్ఞప్తి
-
Meerut Blue Drum Case: హైకోర్టుకు ముస్కాన్, సాహిల్.. ఉరిశిక్షపై అప్పీల్.!
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!