ఎమర్జెన్సీలో 18 నెలల జైలు జీవితంతో నా రాజకీయ జీవన గమనమే మారిపోయింది. నేను, జైపాల్ రెడ్డి ఇద్దరం జాతీయవాదులమే ఐనా సిద్దంతపరంగా భిన్నమైనవాళ్ల.. రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉండాలే తప్ప శత్రువులుగా ఉండొద్దు అన్నారు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. మహబూబ్ నగర్ జిల్లా ధర్మాపూర్ లో జయప్రకాష్ నారాయణ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో మాజీ కేంద్ర మంత్రి సూదిని జైపాల్ రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకయ్యనాయుడు గత అనుభవాలను గుర్తుచేసుకున్నారు.
రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉండాలి… శత్రువులుగా కాదన్నారు. సభలో ఉన్నత ప్రమాణాలుండాలి. డిస్కస్, డిబేట్, డిస్క్రైబ్ చేయాలి. కాని డిస్ట్రబ్ చేయకూడదు. ఉన్నత ప్రమాణాలు , సిద్ధాంత నిబద్దత రాజకీయాల్లో లోపించాయి. రాజకీయాల్ లో ఉన్నతమైన విలువలు, నీతి నిజాయితీ అవసరం ఉందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్లమెంటరీ వ్యవస్థ కలిగిన దేశం మనది. రాజకీయ నేతలు స్పూర్తి , నీతి తప్పొద్దు. చట్టసభలో మాట్లాడండి, శాంతియుతంగా పోరాడండి, కాని సభను జరగనివ్వండి. డెమోక్రసీని కాపాడాలన్నారు వెంకయ్యనాయుడు.
Read Also: Somu Veerraju: ఏపీ అభివృద్ధికి పాటుపడుతోంది బీజేపీయే
రాజకీయాల్లో ఓపిక ఉండాలి. కష్టపడితే , శ్రమిస్తే , పట్టుదల ఉన్నవారెవరైనా అనుకున్న లక్ష్యానికి చేరుకుంటారు. విద్యార్థులు కలలు కనండి, కష్టపడండి సాకారం చేసుకోండి. విద్యార్థులు ఇష్టపడి – కష్టపడండి. భవిష్యత్తులో గొప్పవాళ్లవుతారు. పాఠశాలల్లో ప్రాధమిక స్థాయి విద్య వరకు మాతృభాషలోనే కోరుకునే వ్యక్తిని. కన్నతల్లిని, జన్మభూమిని, మాతృదేశాన్ని మరిచినవాడు మానవుడే కాదు. మాతృభాష ను ప్రేమించండి. తర భాషలను గౌరవించండి.
జైపాల్ రెడ్డి అనర్గళమైన ఇంగ్లీష్ మాట్లాడే వారు, ఐనా తెలుగులో మాట్లాడేందుకే ఇష్టపడేవారు. భారతీయ భాషలను గౌరవించండి. జైపాల్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ఉన్నతలక్ష్యాలకు చేరుకోవడమే ఆయనకు నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్, ఎస్ నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. వీరితోపాటు మహబూబ్ నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి స్వర్ణ సుధాకర్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, వందలాదిమంది విద్యార్ధినీ, విద్యార్ధులు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు.
మహబూబ్ నగర్ జిల్లా ధర్మపుర్ లో ఉన్న జయప్రకాశ్ నారాయణ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థులు బతుకమ్మలు, కోలాటాలు, నృత్యాలతో సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలకడం ఆనందదాయకం. యువత నుంచి నేను ఆశిస్తున్నది ఇలాంటి మార్పునే. ఇదే స్ఫూర్తితో మన సంస్కృతి సంప్రదాయాలను యువత గౌరవించుకోవాలి-ఎం.వెంకయ్యనాయుడు
Read Also: Ponniyin Selvan: పది రోజుల్లోనే మరో మైల్‌స్టోన్.. ఏకంగా 400 కోట్లు
మహబూబ్ నగర్ జిల్లా ధర్మపుర్ లో ఉన్న జయప్రకాశ్ నారాయణ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థులు బతుకమ్మలు, కోలాటాలు, నృత్యాలతో సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలకడం ఆనందదాయకం. యువత నుంచి నేను ఆశిస్తున్నది ఇలాంటి మార్పునే. ఇదే స్ఫూర్తితో మన సంస్కృతి సంప్రదాయాలను యువత గౌరవించుకోవాలి. pic.twitter.com/EOJVEXGuFc
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) October 11, 2022