V Hanumantha Rao: పేదవాడికి న్యాయం చేయడంలో కేసీఆర్ సర్కార్ విఫలమైంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
V Hanumantha Rao Says KCR Govt Failed To Do Justice To Poor: పేదవాడికి న్యాయం చేయడంలో కేసీఆర్ సర్కార్ విఫమైందని టీపీసీసీ మాజీ అధ్యక్షులు, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆరోపించారు. నాగర్ కర్నూల్ సభలో ధరణికి సంబంధించి బలమైన స్టేట్మెంట్ ఇచ్చిన సీఎం కేసీఆర్.. రాష్ట్రంలో ధరణి కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను నేరుగా తెలుసుకొని మాట్లాడాలని అన్నారు. దుబ్బాక ఎన్నికల సమయంలో.. 1981 ఇందిరాగాంధీ నేతృత్వంలో రాజ్ కృష్ణారెడ్డికి సంబంధించిన 500 భూమిని నిరుపేదలకు పంపిణీ చేశారని గుర్తు చేశారు. అయితే.. ఆ భూమి ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఉన్నందున, ధరణి పోర్టల్‌ను ఆసరాగా చేసుకొని రాజ్ కృష్ణారెడ్డి కోడళ్ల పేర్ల మీదకు తిరిగి భూములను మార్చుకున్నారని పేర్కొన్నారు.
Mahi V Raghava : ఆ డైరెక్టర్ అంత వైలెంట్ గా ఎందుకు థింక్ చేసాడు…?
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
అంతేకాకుండా.. నిరుపేదలకు పంచిన భూములను అక్రమంగా లాక్కునే క్రమంలో, రెవిన్యూ అధికారులు సైతం వారి పేర్ల మీదకు మార్చుకున్నట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. అయినప్పటికీ.. వారిపై చర్యలు తీసుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని వీహెచ్ ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలను తెలుసుకొని, ఆ తర్వాతే ధరణి గురించి మాట్లాడాలని కేసీఆర్‌కు సూచించారు. ధరణి వల్ల ప్రజలకు న్యాయం జరగడం లేదు కాబట్టే.. ధరణిని రద్దు చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ తరపున గతంలోనే ఫిర్యాదు చేశామన్నారు. కానీ.. ఇప్పటికీ దానిపై స్పందన లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ధనవంతులకు లబ్ది చేసేందుకే ధరణి రాష్ట్రంలో అమలవుతోందని విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో భర్త చనిపోయిన భార్యలకు రావాల్సిన హక్కులను కేసీఆర్ సర్కార్ కాలరాస్తోందని దుయ్యబట్టారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మంజూరిలో అర్హులైన లబ్దిదారులకు మొండి చేయి చూపించి.. తమ పార్టీ కార్యకర్తలకు, డబ్బున్న ధనవంతులకు కట్టాబేడుతున్నారని ఆరోపణలు చేశారు. కెసిఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే.. ప్రజల్లోకి వచ్చి వారి సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బార్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
Ice Cream: నోరూరిస్తున్న ఫ్రైడ్ ఐస్ క్రీం.. వైరల్ అవుతున్న వెరైటీ రెసిపీ
అంతకుముందు కూడా.. దళిత బంధు పథకంలో కమీషన్ తీసుకోవడం లేదని నిరూపిస్తే, తాను రాజకీయ సన్యాసం చేయడానికి సిద్ధమని వీహెచ్ సవాల్ విసిరారు. కేసీఆర్ ప్రభుత్వ పథకాల్లో లంచం ఇచ్చిన వారికే లబ్ది చేకూరుతోందని ఆరోపించారు. తమది రైతుల పక్షపాత ప్రభుత్వమని.. పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రగల్భాలు పలుకుతోందని అన్నారు. కిసాన్ సర్కార్ అంటూ ఊదరగొడుతున్నారని.. స్వరాష్ట్రమైన తెలంగాణలో రైతుల కన్నీళ్లు పట్టించుకోవడం లేదని ఫైరయ్యారు. ఆకర్షణీయ పథకాలు ముందు పెట్టి.. అవినీతికి పాల్పడుతోందని ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు