Student Sathvik Case: సాత్విక్ ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు.. అదుపులో ఆ నలుగురు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Case Filed On Sri Chaitanya College Sathvik Suicide Incident: శ్రీ చైతన్య కాలేజీ స్టూడెంట్ సాత్విక్ ఆత్మహత్య ఘటనపై కాలేజీ సిబ్బంది మీద పోలీసులు కేసు నమోదు చేశారు. 305 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు ఏపీసీ రమణ గౌడ్ స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పలు విద్యార్థుల నుండి సేకరించామని, విద్యార్థుల తల్లిదండ్రులతోనూ కాలేజీ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని తెలిపారు. విద్యార్థులను కొడుతున్న వీడియోలు కూడా ఉన్నాయని, వాటిని ఆధారాలుగా తీసుకుంటామని పేర్కొన్నారు. మరోవైపు.. శ్రీచైతన్య ఏజీఎం స్వామి మాట్లాడుతూ, ఈ ఘటనపై తాము అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారని.. ఆచార్య, క్రిష్ణారెడ్డి, నరేశ్, జగన్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అన్నారు. సాత్విక్‌ను ఆచార్య కొడుతున్నాడన్న విషయం తమ దృష్టికి రాలేదన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులను కొడుతున్నట్టు నిజమని తేలితే, వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
Kidney For Sale: భరణం కోసం భార్య వేధింపులు.. కిడ్నీ అమ్మకానికి పెట్టిన భర్త
Also Read
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
ఇదిలావుండగా.. హైదరాబాద్ నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజ్‌లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న ఎన్. సాత్విక్ తన క్లాస్‌రూమ్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి 10:30 సమయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉపాధ్యాయులు తనని ‘ఫెయిల్యూర్ ఫెయిల్యూర్’ అంటూ వేధింపులకు గురి చేయడంతో పాటు నిత్యం కొడుతుండటం వల్ల.. సాత్విక్ మానసికంగా కుంగిపోయాడు. ఆ డిప్రెషన్‌లోనే అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. దారుణమైన విషయం ఏమిటంటే.. సాత్విక్ ఉరివేసుకున్న విషయాన్ని గమనించిన విద్యార్థులు, అతడ్ని ఆసుపత్రికి తరలించేందుకు సహకరించాలని సిబ్బందిని కోరినా పట్టించుకోలేదు. దీంతో.. స్నేహితులే అతడ్ని బయట వెహికల్ లిఫ్ట్ అడిగి, ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఆలోపే అతడు తుదిశ్వాస విడిచాడు. బాగా చదివి ఇంటికి పెద్దదిక్కు అవుతాడనుకున్న కొడుకు, ఇలా విగతజీవిగా మారడం చూసి తల్లిదండ్రులు రోదిస్తున్నారు. గతంలో లెక్చరర్స్ కొట్టడం వల్ల తమ కుమారుడు 15 రోజులపాటు ఆసుపత్రి పాలయ్యాడని, ఇప్పుడు తమ అబ్బాయి ఆత్మహత్యకు కాలేజీ యాజమాన్యమే కారణమని ఫిర్యాదు చేశారు.
Myanmar Woman Molested: ఢిల్లీలో దారుణం.. మయన్మార్‌కు చెందిన మహిళపై సామూహిక అత్యాచారం
మరోవైపు.. సాత్విక్ ఆత్మహత్య వార్త విని విద్యార్థులు శ్రీ చైతన్య కాలేజీ వద్ద రోడ్డుపై బైఠాయించి, ధర్నా చేశారు. కుటుంబ సభ్యులు సైతం వారితో కలిసి బైఠాయించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. విద్యార్థులను కాలేజీ క్యాంపస్ లోపలికి నెట్టేశారు. ఈ క్రమంలో అక్కడ భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అటు.. ఈ ఘటనపై ఇంటర్ విద్య కమిషనర్‌తో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడారు. సాత్విక్ మృతిపై విచారణ చేసి, వెంటనే రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. బాద్యులపై చర్యలు తీసుకోవాలని చెప్పారు.
తాజావార్తలు
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!