NTR 30: షిప్ పై భారి యాక్షన్ ఎపిసోడ్ తో షూట్ మొదలు… అరాచకం ఆరంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత పాన్ ఇండియా రేంజులో చేస్తున్న సినిమా ‘ఎన్టీఆర్ 30. కమర్షియల్ సినిమాలకి కొత్త అర్ధం చెప్పిన కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఇటివలే గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్, ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా నటిస్తోంది. అనౌన్స్మెంట్ తోనే హ్యుజ్ ఎక్స్పెక్టేషన్స్ ని సెట్ చేసిన కొరటాల శివ-ఎన్టీఆర్ లు రెగ్యులర్ షూటింగ్ కి రెడీ అవుతున్నారు. సాబు సిరిల్ డిజైన్ చేసిన భారి షిప్ సెట్ లో, హాలీవుడ్ స్టంట్ ఖొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ నేతృత్వంలో భారి యాక్షన్ ఎపిసోడ్ తో ‘ఎన్టీఆర్ 30’ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసమే కొరటాల శివ బ్లడ్ టాంకర్లని కూడా తెప్పించాడనే వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది. హై ఇంటెన్సిటీ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేసి, మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సంధర్భంగా ఒక స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలనేది కొరటాల ప్లాన్ లా కనిపిస్తోంది.
ఎన్టీఆర్ బర్త్ డే రోజున ఒక సాలిడ్ అప్డేట్ వదిలితే అది పాన్ ఇండియా లెవల్లో ఈజీగా ట్రెండ్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే మొదటి షెడ్యూల్ లోనే యాక్షన్ పార్ట్ లోకి దిగేసాడు కొరటాల శివ. అరవింద సమేత వీర రాఘవ సినిమా సమయంలో కూడా త్రివిక్రమ్, ఫస్ట్ హీరో ఇంట్రడక్షన్ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేశాడు. ఆ షెడ్యూల్ నుంచే ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసి అరవింద సమేత సినిమాపై అంచనాలని అమాంతం పెంచేసాడు. ఇదే మ్యాజిక్ ‘ఎన్టీఆర్ 30’ విషయంలో కూడా రిపీట్ అవనుంది కాకపోతే ఈసారి పాన్ ఇండియా స్థాయిలో… సముద్రం బ్యాక్ డ్రాప్ లో, మృగాల్లాంటి మనుషులని భయపెట్టే పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. కొరటాల మార్క్ డైలాగ్స్ కి, ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ కి, అనిరుద్ మ్యూజిక్ కూడా కలిసింది కాబట్టి ‘ఎన్టీఆర్ 30’ సౌండ్ గట్టిగానే వినిపించబోతుంది.
Also Read
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
- Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
- YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
తాజావార్తలు
-
Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
-
Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
-
IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
-
Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!