కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి కౌంటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్ ఉప ఎన్నికల తర్వాత టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఆరోపణలు, విమర్శల పర్వం ఆగిపోతుందనుకుంటే.. వాటి తీవ్రత మరింత పెరిగింది.. సీఎం కేసీఆర్ ఎంట్రీతో హీట్ మరింత పెరిగింది.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు కేంద్ర ప్రభుత్వం, మంత్రులు, ప్రధాని నరేంద్ర మోడీ ఇలా.. అన్ని విషయాలను తూర్పారబడుతున్నారు సీఎం కేసీఆర్.. అయితే, బీజేపీ నేతలు కూడా అదేస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.. ఇక, ఇవాళ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. కేసీఆర్ బెదిరింపులకు బీజేపీ భయపడదన్న ఆయన.. తెలంగాణలో 26,641 కోట్ల రూపాయలు ఖర్చు చేసి బియ్యం సేకరణ చేస్తున్నామని వెల్లడించారు.. పంజాబ్ తర్వాత తెలంగాణ నుంచే అత్యధికంగా 94 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేంద్రం సేకరిస్తుందని తెలిపిన కిషన్‌రెడ్డి.. తెలంగాణ సీఎం కేసీఆర్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు అంటూ మండిపడ్డారు.
600 లక్షల మెట్రిక్ టన్నులు దేశమంతా సేకరిస్తే, తెలంగాణ నుంచి అత్యధికంగా 94 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కేంద్రం సేకరిస్తుందని తెలిపారు కిషన్‌రెడ్డి… ముడి బియ్యం తీసుకోవడానికి కేంద్రానికి ఎలాంటి అభ్యంతరం కూడా లేదన్న ఆయన.. ఉప్పుడు బియ్యం ఎవరు తినరు అన్నారు.. రైస్ మిల్లర్లతో మాట్లాడి యంత్రాలను మార్చి ముడి బియ్యంగా మార్చాలని సూచించారు కిషన్‌రెడ్డి. కాగా, వరి ధాన్యం కొనుగోళ్ల విషయం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విమర్శలకు దారి తీస్తోంది.. కేంద్రంపై ఒత్తిడి తేవడమే లక్ష్యంగా కార్యాచరణ ప్రకటించిన కేసీఆర్.. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
Also Read
- Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Devji : లాసెట్‌లో మెరిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ..
- OTR : మంత్రి శ్రీధర్‌బాబుతో ఎంపీ వంశీకి సెట్ అయిందా?
తాజావార్తలు
-
KS Bharat Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్..
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
-
KL Rahul: కేఎల్ రాహుల్‌కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..