Irumudi: ‘ఇరుముడి’తో మారిపోయిన మాస్ రాజా.. రవితేజ కెరీర్‌కి ఈ సినిమా హిట్ చాలా తప్పనిసరి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Irumudi: మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా ‘ఇరుముడి’పై ప్రస్తుతం టాలీవుడ్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు వరుస యాక్షన్, కమర్షియల్ సినిమాలతో అలరించిన రవితేజ.. ఈసారి తన రూట్ మార్చినట్లు తాజాగా రిలీజ్ అయిన ఇరుముడి ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కథ, కుటుంబ భావోద్వేగాలు, భక్తి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ తెరకెక్కిన ఈ చిత్రం మాస్ రాజా అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. సాధారణంగా స్టార్ హీరోలు ఒక సినిమా పూర్తయ్యే వరకు మరో ప్రాజెక్ట్‌పై పెద్దగా దృష్టి పెట్టరు. కానీ రవితేజ మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తాజాగా రిలీజ్ అయిన ‘ఇరుముడి’ ట్రైలర్‌తో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. ఈ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘ఇరుముడి’లో రవితేజ అయ్యప్ప మాల ధరించిన లుక్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. తండ్రి-కూతురు అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన గ్లిమ్స్, ట్రైలర్, పాటలు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్గానే కాకుండా భక్తి, కుటుంబ భావోద్వేగాలకు పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ప్రియా భవాని శంకర్ హీరోయిన్గా నటిస్తుండగా.. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఇక రవితేజకు ఈ సినిమా సక్సెస్ కీలకంగా మారింది. ‘ధమాకా’ తర్వాత ఆయనకు చెప్పుకోదగ్గ హిట్ దక్కలేదు. మరోవైపు దర్శకుడు శివ నిర్వాణకు కూడా విజయం అవసరమే. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి హిట్స్ తర్వాత ‘టక్ జగదీష్’, ‘ఖుషి’ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో కొంత గ్యాప్ తీసుకుని శివ నిర్వాణ ‘ఇరుముడి’ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మరి ఈసారి రవితేజ, శివ నిర్వాణ కలిసి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.
Also Read
- Suhas: తెలుగు ఆడియన్స్ అనే పదమే రావట్లేదా సుహాస్?
- Suhas Colour Row: నేను తెలుగు ప్రేక్షకులను అనలేదు మహాప్రభో! వివరణ ఇచ్చుకున్న 'మండాడి' డైరెక్టర్!
- Mirzapur The Movie: 14వ రోజూ దుమ్మురేపిన 'మీర్జాపూర్: ది మూవీ'.. రూ.300 కోట్ల క్లబ్‌కు అడుగు దూరంలో!
- Zombie Reddy 2: తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో మైండ్ బ్లాక్ చేస్తున్న ఉపేంద్ర ఫస్ట్ లుక్ పోస్టర్!
తాజావార్తలు
-
Suhas: తెలుగు ఆడియన్స్ అనే పదమే రావట్లేదా సుహాస్?
-
KFC పార్కింగ్‌లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
-
SIPB: విశాఖపట్నంలో ఉపాధి అవకాశాలు.. దిగ్గజ సంస్థల ఏర్పాటుకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్..
-
MLA Danam Nagender : అసెంబ్లీ జీరో అవర్ దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Gurugram: వామ్మో ఇదేం జాడ్యం.. హిట్ అండ్ రన్ కేసులో నిందితుడికి మద్దతుగా కార్ల ర్యాలీ
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..