Uttar Pradesh: మహిళలకు రూ.50,000.. సంచలన నిర్ణయం దిశగా యోగి సర్కార్..
- సంచలన నిర్ణయం దిశగా యోగి సర్కార్..
- మహిళలకు రూ. 50,000 ?
- ఎన్నిలక ముందు బీజేపీ వరాల జల్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ తన పథకాలను విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. ప్రభుత్వం మహిళలకు రూ. 50,000 వరకు ఆర్థిక సాయం అందించాలని యోచిస్తోంది. అయితే, ఈ మొత్తాన్ని ఒకేసారి నగదు రూపంలో ఇవ్వాలా? లేక ఇప్పటికే అమలులో ఉన్న మహిళా సంక్షేమ పథకాలను విస్తరించి వివిధ రూపాల్లో ప్రయోజనం కల్పించాలనా? అనే ఆలోచన చేస్తోంది.
అర్హత కలిగిన మహిళల బ్యాంకు ఖాతాల్లోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా నేరుగా నగదు జమ చేయాలనే ఒక ప్రతిపాదన ఉంది. మరో మార్గంగా విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాలకు సంబంధించిన పథకాల ద్వారా ఆర్థిక ప్రయోజనం అందించే అంశాన్ని పరిశీలిస్తోంది. రూ. 50,000 మొత్తాన్ని ఒకేసారి నగదు రూపంలో ఇవ్వకుండా, ఇప్పటికే అమలులో ఉన్న మహిళా సంక్షేమ పథకాలను మరింత విస్తరించే అవకాశం కూడా ఉంది.
Also Read
- Sahil Wakode Death: IIT బాంబే విద్యార్థి సాహిల్ కేసులో కీలక మలుపు.. సీసీటీవీలో ఎగ్జామ్ హాల్ దృశ్యాలు..
- Supreme Court: ‘వందేమాతరం’పై సుప్రీంకోర్టులో వాడీవేడి చర్చ.. ‘నక్సలైట్’ వ్యాఖ్యపై తీవ్ర వాగ్వాదం
- Bihar: బీహార్ లైంగిక వేధింపుల ఘటనలో నిందితుడి ఎన్కౌంటర్.. అసలు ఏం జరిగిందంటే..?
- Central Government Jobs: జేన్ జీకి ఈ మూడు ప్రభుత్వ ఉద్యోగాలంటే ఎందుకంత పిచ్చి? ఆసక్తికర విషయాలు..
యూపీలో అమలు అవుతున్న మహిళా సంక్షేమ పథకాలు ఇవే:
*ముఖ్యమంత్రి కన్యా సుమంగళ యోజన: పుట్టుక నుంచి విద్యలో వివిధ దశలు, గ్రాడ్యుయేషన్ వరకు అర్హత కలిగిన బాలికలకు మొత్తం రూ.15,000 వరకు ఆర్థిక సాయం.
*రాణి లక్ష్మీబాయి స్కూటీ యోజన: గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ప్రతిభావంతులైన విద్యార్థినులకు స్కూటర్లు అందించే లక్ష్యంతో ఉన్న పథకం.
*నిరాశ్రిత మహిళా పెన్షన్ యోజన: అర్హత కలిగిన నిరాశ్రయ మహిళలు, వితంతువులకు జీవనోపాధి కోసం ప్రతి మూడు నెలలకు రూ.3,000 సాయం.
*రాణి లక్ష్మీబాయి మహిళా ఏవం బాల్ సమ్మాన్ కోష్: యాసిడ్ దాడులు సహా తీవ్రమైన హింసకు గురైన మహిళలు, పిల్లలకు చికిత్స, పునరావాసం కోసం ఆర్థిక సాయం.
*ముఖ్యమంత్రి సామూహిక వివాహ యోజన: పేద, నిరాశ్రయ కుటుంబాల కుమార్తెలు, వితంతు మహిళల కుమార్తెల వివాహాలకు ఆర్థిక సహాయం.
*స్వయం సహాయక సంఘాలు, లఖ్పతి దీదీ: మహిళలను స్వయం ఉపాధి, చిన్న వ్యాపారాలు, జీవనోపాధి అవకాశాలతో అనుసంధానించి ఆర్థికంగా స్వావలంబన సాధించేలా చేయడం.
*యూపీ రోడ్వేస్ ఉచిత ప్రయాణం: 60 ఏళ్లు పైబడిన మహిళలకు ఉత్తరప్రదేశ్ రోడ్వేస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం.
తాజావార్తలు
-
Sahil Wakode Death: IIT బాంబే విద్యార్థి సాహిల్ కేసులో కీలక మలుపు.. సీసీటీవీలో ఎగ్జామ్ హాల్ దృశ్యాలు..
-
Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో ఊహించని ట్విస్ట్ ఇవ్వనున్న సుబ్బలక్ష్మి!
-
Supreme Court: ‘వందేమాతరం’పై సుప్రీంకోర్టులో వాడీవేడి చర్చ.. ‘నక్సలైట్’ వ్యాఖ్యపై తీవ్ర వాగ్వాదం
-
New Pensions: శుభవార్త.. కొత్త పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
-
Kayadu Lohar: “తెలంగాణ యాస నా వల్ల కాలేదు!”
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!