నరేంద్ర మోడీ నీ దేశం నుండి తరిమి కొట్టేందుకు మీరు ఎవరు? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. గవర్నర్ ను అవమానిస్తారు… మంత్రులతో తిట్టిపిస్తారని మండిపడ్డారు. అధికారం పోతుంది అనే భయంతో కేసీఆర్ ఉన్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం దూరం అవుతుందని అందరినీ గోకుతున్నారని విమర్శించారు. సీబీఐ, ఈడి రావాలి మళ్ళీ సానుభూతి పొందాలి, సెంటిమెంటు వాడుకోవాలి అని అనుకుంటున్నారని ఎద్దేవ చేశారు. అహంకారంతో మాట్లాడుతుంది మేము కాదు మీరని కిషన్ రెడ్డి అన్నారు.…
Kishan Reddy: మోడీ నీ గద్దె దించుతాడు అట.. కేసీఆర్ నోటి నుండి వస్తే అమృత పదాలా? అంటూ ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ ఆర్ నీ మించిన ఫాసిస్ట్, నియంత, అప్రజాస్వామిక, అహంకార వాది మరొకరు లేరని మండిపడ్డారు. ఆయనకున్న అధికార దాహం మరొకరికి లేదని విమర్శించారు. మోడీ నీ గద్దె దించుతాడు అట… ఉన్న ఎనిమిది సీట్లు కూడా వచ్చే ఎన్నికలలో తెలంగాణ ప్రజలు ఉద్చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు…