Mahabubnagar: మహబూబ్ నగర్ జిల్లా కల్తీ కల్లు ఘటనపై సుమోటో దాఖలైన అయిన విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. మహబూబ్ నగర్ జిల్లాలో కల్తీ కల్లు తాగి ముగ్గురు మృతి చెందగా, 42 మంది అస్వస్థతకు గురైన ఘటనపై అందిన లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది.
మహబూబ్ నగర్ జిల్లాలో కల్తీ కల్లు తాగి పది మంది అస్వస్థతకు గురి కావడం కలకలం రేపుతుంది. కల్తీకల్లు వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి రావడంతో అధికారులు షాక్ కు గురయ్యారు.