Mahabubnagar: మహబూబ్ నగర్ జిల్లా కల్తీ కల్లు ఘటనపై సుమోటో దాఖలైన అయిన విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. మహబూబ్ నగర్ జిల్లాలో కల్తీ కల్లు తాగి ముగ్గురు మృతి చెందగా, 42 మంది అస్వస్థతకు గురైన ఘటనపై అందిన లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది.
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వడదెబ్బతో ఇద్దరు మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో ఉట్నూర్ మండలం పులిమడుగులో ఒక్కరు, కొమరంభీం జిల్లా కాగజ్‌నగర్ లో ఇబ్రాహీం అనే పండ్ల వ్యాపారి వడదెబ్బతో మృతి చెందడం కలకలం రేపింది.
మహబూబ్ నగర్ జిల్లాలో కల్తీ కల్లు తాగి పది మంది అస్వస్థతకు గురి కావడం కలకలం రేపుతుంది. కల్తీకల్లు వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి రావడంతో అధికారులు షాక్ కు గురయ్యారు.
తెలంగాణలో కీసర పోలీస్ స్టేషన్ పరిధి ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంజ్ కార్ AP 09 BU 0990 కార్ అదుపు తప్పి డివైడర్ ఢీ కొట్టింది. అదే వేగంతో.. ఎదురుగా వస్తున్న మరో కార్ TS 05 UC 4666 టాటా విస్టాను ఢీ కొట్టడంతో దీంతో ఇద్దరు స్పాట్ లోనే చనిపోయారు.