మహబూబ్నగర్ జిల్లా కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు రైతు పండుగను నిర్వహిస్తోంది. అన్ని జిల్లాల రైతులు ఈ వేడుకల్లో పాలుపంచుకునేందుకు వ్యవసాయ శాఖతో పాటు అనుబంధ శాఖలన్నీ భారీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, లాభసాటి విధానాలు, వివిధ పంట ఉత్పత్తులపై అవగాహన కల్పించేందుకు ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. రైతు సదస్సులో భాగంగా 25 వివిధ విభాగాల అధ్వర్యంలో 150 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ముగిసింది. ఈ సందర్భంగా అధికారులకు సీఎం కీలక ఆదేశాలు ఇచ్చారు. అన్ని ప్రాజెక్టుల కింద భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ చెల్లింపులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పెండింగ్ బిల్లుల చెల్లింపుకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా.. పాలమూరు- రంగారెడ్డి తప్పా.. అన్ని ప్రాజెక్టులను 18 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
మంగళవారం సివిల్స్ ఫలితాలు విడుదల కాగానే తెలుగు తేజం అనన్య రెడ్డి పేరు పేరు మార్మోగిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్తు దేశమంతా ఆమె పేరు అందరినోళ్లలో వినిపిస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో పల్లెవెలుగు, ఎక్సెప్రెస్ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా ధన్వాడలో 182 మంది మహిళలతో వెళ్తున్న రూరల్ బస్సు టైర్ల నుంచి పొగలు రావడంతో ఆగిపోయింది.
Mahabubnagar: మహబూబ్ నగర్ జిల్లా కల్తీ కల్లు ఘటనపై సుమోటో దాఖలైన అయిన విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. మహబూబ్ నగర్ జిల్లాలో కల్తీ కల్లు తాగి ముగ్గురు మృతి చెందగా, 42 మంది అస్వస్థతకు గురైన ఘటనపై అందిన లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది.
KTR: ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా భూత్పూర్, మూసాపేట మండలం వేముల, మహబూబ్ నగర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
Rangareddy Crime: రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళ దారుణ హత్య స్థానికంగా కలకలం రేపుతోంది. ముగ్గురు కలిసి ఓ మహిళను హత్య చేశారు. మహిళ గొంతుకు చున్నీ బిగించి హత్య చేశారు.
మహబూబ్ నగర్ జిల్లాలో కల్తీ కల్లు తాగి పది మంది అస్వస్థతకు గురి కావడం కలకలం రేపుతుంది. కల్తీకల్లు వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి రావడంతో అధికారులు షాక్ కు గురయ్యారు.