Anand Mahindra: నెటిజెన్ ప్రశ్నకు.. మనసుకు హత్తుకునేలా మహీంద్రా పోస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొందరి వ్యక్తులకు ఎంత డబ్బున్న అహంకారం వుండదు. ఎదుటి వారితో మర్యాదగా మాట్లాడి వారికి నేను నీలాంటి మనిషినే అంటూ కలిసిపోతుంటారు. ఎదుటివారి కష్టాన్ని అర్థం చేసుకుని నేను కష్టపడే వచ్చానంటే వారికి మరింత స్పూర్తినిస్తూ వుంటారు. అలాంటి వారు మనదేశంలో బహుఅరుదు అందులో ఒకరు ఆనంద్ మహీంద్రా అని చెప్పవచ్చు. ఇక్కడే కాదు ప్రపంచంలోనే పేరున్న వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా. ఆయన తన వ్యాపార సామ్రాజ్యంతో పాటు తరచుగా సోషల్ మీడియా వేదికగా పలు సందర్భాల్లో స్పందిస్తూ, ప్రజలకు మరింత చేరువైన మహీంద్రా.. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా వుంటారు.
మహీంద్ర తనకు నచ్చిన మనసు మెచ్చిన రకరకాల చిత్రాలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వుంటారు. అయితే కొన్ని సార్లు తమాసాగా కూడా పోస్ట్ లతో ప్రజలను నవ్విస్తుంటారు. దీనికి నిదర్శనం కొద్దిరోజుల క్రితం మంత్రి కేటీఆర్ పై చేసిన పోస్ట్.. మంత్రి కేటీఆర్ కే కాదు.. ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. అంతేకాదు ఒక్కొక్కసారి భావోద్వేగ పోస్టులతో అందరినీ కంటతడి పెట్టిస్తారు మహీంద్రా. ఈనేపథ్యంలో ప్రతిభ ఉండి, అవకాశం లేనివారికి తాను అండగా నిలబడతారు మహీంద్రా.
Also Read
సహాయం చేస్తా అని చెప్పడమే కాదు.. చేతనైన సహాయం వెంటనే చేసి వారి మనసుల్లో స్థానాన్ని సంపాదించుకుంటారు. ఇది ఇలావుంటే ప్రస్తుతం మహీంద్రా తాజాగా ఓపోస్ట్ చేసారు. అది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఆపోస్ట్ లో ఆనంద్ మహీంద్రా చెప్పిన సమాధానం చూస్తే ఎవరి హృదయమైనా సంతోషంతో పొంగిపోవాల్సిందే అని చెప్పాలి. ఇంతకీ ఆపోస్ట్ ఏంటంటే.. ఆనంద్ మహీంద్రా ప్రస్తుతం న్యూయార్క్ లోని మాన్ హట్టన్ కి తన కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడుపుతున్నారు.
అయితే అక్కడ వున్న కొన్ని చిత్రాలను ఫోటో తీసి ఆయన పోస్ట్ చేసారు. దీంతో ఓ నెటిజన్ స్పందిస్తూ.. మీరు ఎన్నారైనా? అంటూ అడిగాడు.. దానికి ఆనంద్ మహీంద్రా చాలా అందంగా సమాధానం ఇచ్చారు. నేను కుటుంబంతో కలిసి గడపడానికి న్యూయార్క్ వచ్చాను.. అంతేకానీ నేను హృదయపూర్వకంగా భారతీయుడిని అంటూ ఇచ్చిన సమాధానం అందరిని ఆకట్టుకుంటోంది. కొందరు నెటిజన్లు మహీంద్రా పోస్ట్పై వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు. మరొ కొందరు గ్రేట్ రిప్లై అంటూ పేర్కొంటున్నారు. ఇంకొందరైతే నేను కూడా హృదయపూర్వకంగా హిందూస్తానీనే అని కొందరు పోస్ట్ చేస్తున్నారు. మరో నెటిజన్ అయితే సార్ మీరు మాలాగే వున్నారు.. మీరు సమయం గడపడానికి ఉదయం ట్విట్టర్ లోకి వస్తారని చాలా ఫన్నీగా కామెంట్ చేసాడు.
Just visiting family in New York. So am an HRI. Heart (always) resident in India….😊 https://t.co/ydzwTux9vr
— anand mahindra (@anandmahindra) July 5, 2022
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!