NRI Arrest: గృహహింస కేసులో కాలిఫోర్నియాలో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి చెందిన ఎన్నారై జెస్వంత్ మనికొండ (36) ను పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ పోలీస్ డిపార్ట్‌మెంట్ (MPD) అధికారులు, సాంటా క్లారా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయంతో కలిసి దర్యాప్తు నిర్వహించి జెస్వంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. భార్యపై గృహహింసకు పాల్పడటంతో పాటు, కోర్టు జారీ చేసిన రక్షణ ఉత్తర్వు ను ఉల్లంఘించినట్లుగా జెస్వంత్‌పై ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల నివేదికల ప్రకారం,…
అమెరికా పోలీసులు అమానుషానికి పాల్పడ్డారు. ఒక భారతీయ విద్యార్థి పట్ల అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. న్యూజెర్సీలోని న్యూవార్క్ విమానాశ్రయంలో ఒక భారతీయ విద్యార్థి పట్ల దుర్మార్గంగా ప్రవర్తించారు.
KTR : డల్లాస్‌లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ, బీఆర్ఎస్ రజతోత్సవ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. 14 ఏళ్ల కఠిన పోరాటం ద్వారా సాధించిన తెలంగాణ రాష్ట్రం, కేసీఆర్ నాయకత్వంలో పదేళ్లలోనే దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదిగిన ఘనత గురించి ఆయన గర్వంగా చెప్పారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత విజయవంతమైన స్టార్టప్ స్టేట్‌గా తెలంగాణ నిలిచిందని, దేశ ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమైన ఇంజన్‌గా అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ నాయకత్వానికి…
Digital arrest: డిజిటల్ అరెస్ట్ స్కామ్స్ దేశంలో ఎక్కువ జరుగుతున్నాయి. పోలీస్ అధికారులు, ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులగా ఫోజు కొడుతూ స్కామర్లు అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు.
Law Commission: ఎన్నారైలు భారతీయ పౌరులను ముఖ్యంగా అమ్మాయిలను మోసపూరితంగా వివాహాలు చేసుకోవడం ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి. ఇలాంటి కేసులు ఆందోళనకరమైన ధోరణిని ప్రతిబింబిస్తున్నాయని లా కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రవాసులు, భారతీయులను పెళ్లి చేసుకునే విషయంలో సమగ్ర చట్టాలను తీసుకురావాలని లా ప్యానెల్ సిఫారసు చేసింది. "ప్రవాస భారతీయులు మరియు విదేశీ పౌరులకు సంబంధించిన మ్యాట్రిమోనియల్ ఇష్యూలపై చట్టం"పై ప్యానెల్ చైర్మన్ జస్టిస్(రిటైర్డ్) రీత్ రాజ్ అవస్తీ కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖకు నివేదిక అందించారు.
Hyderabad Woman: ఆస్ట్రేలియాలో డిప్యూటీ మేయర్‌గా తెలంగాణ మహిళ ఎన్నికయ్యారు. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌వేల్స్‌లోని సిడ్నీలోని స్ట్రాత్‌ఫీల్డ్ మున్సిపాలిటీకి డిప్యూటీ మేయర్‌గా కర్రి సంధ్యారెడ్డి అనే మహిళ గురువారం ఎన్నికయ్యారు.