Invest Telangana Summit : ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సులో క్లైమేట్ ఛేంజ్‌పై ప్రత్యేక చర్చ
- ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సులో వాతావరణ మార్పులకు ప్రత్యేక ప్రాధాన్యం
- ఎల్‌నినో, వర్షాభావం, నీటి కొరతపై నిపుణుల చర్చ
- ప్రపంచ దేశాల అనుభవాలు, ఆధునిక పరిష్కారాలపై దృష్టి
- గ్రీన్ ఎనర్జీ, సుస్థిర అభివృద్ధికి పెట్టుబడుల ప్రోత్సాహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో పెట్టుబడుల పండుగకు వేళయైంది. హైదరాబాద్‌లోని ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ వేదికగా డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026’ను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. దేశ విదేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు, వివిధ రంగాల నిపుణులు హాజరయ్యే ఈ ప్రతిష్టాత్మక సదస్సులో ఈసారి ఒక కీలక అంశం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ప్రధాన వ్యాపార అంశాలతో పాటు ‘క్లైమేట్ ఛేంజ్’ (వాతావరణ మార్పులు) అంశాన్ని ప్రత్యేక ‘సబ్ థీమ్’గా చేర్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
వాతావరణ మార్పులు, ఎల్‌నినో సవాళ్లపై ప్రత్యేక చర్చ
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం వల్ల తలెత్తుతున్న తీవ్రమైన సవాళ్లు, వాటిని అధిగమించేందుకు వివిధ దేశాలు అవలంబిస్తున్న సత్ఫలితాలపై ఈ వేదికగా ప్రత్యేక సెమినార్ నిర్వహించనున్నారు. ఐఎండీ వాతావరణ శాఖ నిపుణులు, ప్రముఖ విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పర్యావరణ రంగ నిపుణులను ఈ చర్చకు ఆహ్వానించనున్నారు. ముఖ్యంగా వర్షాభావం, తీవ్ర నీటి కొరత, వ్యవసాయ రంగ సంక్షోభం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, విద్యుత్ డిమాండ్, పర్యావరణ పరిరక్షణ , వాతావరణ మార్పులకు అనుగుణంగా దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనపై ప్రతినిధులు లోతుగా చర్చించనున్నారు.
Also Read
- El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. కరువుపై తెలంగాణ సర్కార్ కీలక భేటీ
- Hyderabad: పెళ్లి పేరుతో నమ్మించి తెచ్చి నరకం చూపించాడు..
- Hyderabad: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య..
- Hyderabad: రాజేంద్రనగర్ పరిధిలో భారీ పేలుడు శబ్దం.. ఇళ్లపైకి పరుగులు తీసిన ప్రజలు.. అసలు ఏం జరిగింది?
గ్లోబల్ వేదికపై తెలంగాణ ముందస్తు చర్యలు
ఎల్‌నినో వంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిన ముందస్తు చర్యలను, విజయవంతమైన నమూనాలను ఈ అంతర్జాతీయ వేదికపై ప్రభుత్వం వివరించనుంది. అదే సమయంలో ఇతర దేశాల్లో అనుసరిస్తున్న ఆధునిక సాంకేతిక పరిష్కారాలు, సుస్థిర విధానాలను అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ సమ్మిట్‌లో కేవలం పెట్టుబడులే కాకుండా పర్యావరణ అనుకూల పరిశ్రమలు (ఈకో ఫ్రెండ్లీ ఇండస్ట్రీస్), గ్రీన్ ఎనర్జీ, సుస్థిర అభివృద్ధి (సస్టైనబుల్ డెవలప్మెంట్) అంశాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
రక్షా ఎక్స్పో, స్టార్టప్‌ల ప్రదర్శనలు.. ముమ్మరమైన ప్రచారం
ఈ గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా ‘రక్షా ఎక్స్పో–2026’తో పాటు ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), నూతన స్టార్టప్‌ల ఆవిష్కరణలను ప్రదర్శించనున్నారు. పారిశ్రామిక విధానాల ఆవిష్కరణలు, భారీ పెట్టుబడి ఒప్పందాలకు (MoUs) ఈ సదస్సు నిలయం కానుంది. ఇప్పటికే హైదరాబాద్‌లో రక్షా ఎక్స్పో కర్టెన్ రైజర్ నిర్వహించగా, అక్టోబర్ 29న న్యూఢిల్లీలో గ్లోబల్ సమ్మిట్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ సంస్థలను తెలంగాణకు ఆహ్వానించేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు వెళ్తోంది.
తాజావార్తలు
-
Invest Telangana Summit : ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సులో క్లైమేట్ ఛేంజ్‌పై ప్రత్యేక చర్చ
-
Karnataka SIR: కర్ణాటకలో SIR పూర్తి.. కోటి మంది పేర్లు తొలగింపు..
-
Postal Ballot Rules 2026: పోస్టల్ బ్యాలెట్ పేపర్లపై కొత్త నిబంధనలు.. APSEC కీలక నిర్ణయం..
-
TPCC Mahesh Goud : కేటీఆర్, హరీష్ భ్రమల్లో ఉన్నారు.. కాంగ్రెస్ టార్గెట్ 100
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
ట్రెండింగ్
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!