KPHB Incident: కేపీహెచ్బీలో కన్నీటి విషాదం.. చిన్నారితో సహా పశ్చిమ బెంగాల్ దంపతుల ఆత్మహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీ 3వ ఫేజ్‌లో గుండెలను పిండేసే తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. బతుకుదెరువు కోసం వేల మైళ్ల దూరం నుంచి వచ్చిన పశ్చిమ బెంగాల్‌కు చెందిన గోపి, సమత దంపతులు ఆర్థిక కష్టాల సుడిగుండంలో చిక్కుకుని, తమ రెండేళ్ల చిన్నారి స్నిగ్ధతో సహా ప్రాణాలు తీసుకున్నారు. కొంతకాలంగా రోజువారీ అవసరాలు తీరక, చేసిన అప్పులు తీర్చే దారి కనిపించక వారు తీవ్ర మానసిక క్షోభ అనుభవించారు.
తాము చనిపోతే రెండేళ్ల పసికందు అనాథగా మారి కష్టాలు పడుతుందనే బెంగతో, ముందుగా చిన్నారి స్నిగ్ధను ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఆ తర్వాత దంపతులిద్దరూ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. చనిపోయే ముందు వారు తమ ఇంటి గోడపై “మా చావుకు ఎవరూ కారణం కాదు, ఈ విషయంలో వేరే ఎవరినీ ఎటువంటి వివరాలు అడగవద్దు. ఇది చాలా కాలం క్రితం మేమిద్దరం కలిసి బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. మేము తప్పు చేస్తున్నామని తెలుసు, కానీ మాకు వేరే మార్గం లేదు, దయచేసి మమ్మల్ని క్షమించండి” అని ఆవేదనతో రాశారు.
Also Read
- Tanuja Ranjan Murder Case: సినిమా థ్రిల్లర్‌ను తలపించిన ఆపరేషన్ నేపాల్.. హైదరాబాద్ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్
- Hyderabad Crime: కంచన్‌బాగ్‌లో దారుణం.. మయన్మార్ మహిళపై సామూహిక లైంగిక దాడి..!
- Retired IPS Officer Wife Murder Case: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసును ఛేదించిన పోలీసులు..
- Eagle Force: హైదరాబాద్‌లో ఈగిల్ ఫోర్స్ మెరుపు దాడి.. 75 ఏళ్ల వృద్ధురాలు అరెస్ట్
ఇంటి తలుపులు ఎంతకీ తెరవకపోవడంతో స్థానికులు కేపీహెచ్‌బీ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తలుపులు పగులగొట్టి చూడగా, చిన్నారి విగతజీవిగా పడి ఉండగా, దంపతులు వేలాడుతూ కనిపించారు. క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Sonia Gandhi: రాజీవ్ గాంధీ ప్రధాని కావడం నాకు ఇష్టం లేదు.. సోనియా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Arnab Cyclone Alert: తీరానికి సమీపంలో ‘అర్నబ్’ తుఫాన్.. మరో 12 గంటలు అత్యంత అప్రమత్తం!
-
Arnab Cyclone: కోనసీమకు కాళరాత్రి.. గజగజ వణుకుతున్న లంక గ్రామాలు
-
KPHB Incident: కేపీహెచ్బీలో కన్నీటి విషాదం.. చిన్నారితో సహా పశ్చిమ బెంగాల్ దంపతుల ఆత్మహత్య..
-
AP Cyclone Alert: 160 కి.మీ. వేగంతో గాలులు.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. సీఎం వార్నింగ్..
ట్రెండింగ్
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!