AP Local Body Elections: స్థానిక ఎన్నికల నామినేషన్ విధానంపై హైకోర్టులో పిటిషన్.. కీలక ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆన్లైన్ నామినేషన్ విధానాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) అమలు చేయడం లేదని దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ పత్రాలు, అఫిడవిట్లను ఆన్లైన్లో సమర్పించే విధానాన్ని అమలు చేసేలా ఎస్ఈసీని ఆదేశించాలని కోరుతూ గురు తేజ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించిన హైకోర్టు, తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.
2023లోనే ఆన్లైన్ నామినేషన్ల కోసం లేఖ
2023 సెప్టెంబర్‌లో ఆన్లైన్ నామినేషన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి లేఖ రాసినట్లు పిటిషనర్ తరఫున వివరించారు. ఈ విధానాన్ని అమలు చేసేందుకు రూ.3 కోట్లు అవసరమని ఎస్ఈసీ కోరగా, ప్రభుత్వం రూ.1.47 కోట్లు విడుదల చేసిందని పేర్కొన్నారు. అనంతరం 2025 మేలో ఆన్లైన్ నామినేషన్ పోర్టల్‌ను ఎస్ఈసీ సిద్ధం చేసిందని, ఈ విధానాన్ని ఎలా అమలు చేయాలనే అంశంపై సర్క్యులర్లు కూడా జారీ చేసిందని పిటిషన్లో వివరించారు.
Also Read
- Sonia Gandhi: రాజీవ్ గాంధీ ప్రధాని కావడం నాకు ఇష్టం లేదు.. సోనియా ఆసక్తికర వ్యాఖ్యలు..
- Arnab Cyclone Alert: తీరానికి సమీపంలో ‘అర్నబ్’ తుఫాన్.. మరో 12 గంటలు అత్యంత అప్రమత్తం!
- AP Cyclone Alert: 160 కి.మీ. వేగంతో గాలులు.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. సీఎం వార్నింగ్..
- Abhishek Sharma: అభిషేక్ శర్మ బ్యాటింగ్‌కు పాక్ దిగ్గజాలు ఫిదా..‘‘ఇంతటి విధ్వంసాన్ని ఎప్పడూ చూడలేదు!’’
నామినేషన్‌తో పాటు అఫిడవిట్ ఆన్లైన్లో సమర్పణ
2026 మార్చి 18న ఎస్ఈసీ ఒక ఉత్తర్వు కూడా జారీ చేసిందని పిటిషనర్ పేర్కొన్నారు. అభ్యర్థులు తమ నామినేషన్, అఫిడవిట్లను ఆన్లైన్లో సమర్పించడంతో పాటు, వాటి భౌతిక ప్రతిని కూడా అందజేయాలని ఎస్ఈసీ సూచించినట్లు వివరించారు. ఈ విధానం అమలుకు సంబంధించి చర్యలు తీసుకున్నప్పటికీ, స్థానిక ఎన్నికల్లో ఆన్లైన్ నామినేషన్ ప్రక్రియ పూర్తిస్థాయిలో అమలులోకి రాలేదని పిటిషనర్ వాదించారు.
ఎన్నికల్లో హింసాత్మక ఘటనలపై పిటిషనర్ ప్రస్తావన
ఈ ఏడాది మార్చి 12న ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు రాజకీయ పార్టీలు ఆన్లైన్ నామినేషన్ విధానం అమలు చేయాలని కోరినట్లు పిటిషనర్ తరఫున కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే, ఆ సమయంలో సమయం లేదని చెప్పినట్లు పేర్కొన్నారు. ఆన్లైన్ విధానానికి అవకాశం ఉన్నప్పటికీ, 187 చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని, 54 చోట్ల నామినేషన్ పత్రాలను చించివేయడం లేదా లాక్కోవడం వంటి ఘటనలు జరిగాయని పిటిషనర్ వాదించారు. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రానున్న పంచాయతీ ఎన్నికల్లో ఆన్లైన్ నామినేషన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడ్వొకేట్ జనరల్ (ఏజీ), ప్రస్తుతం నామినేషన్లను భౌతిక రూపంలో సమర్పించే విధానం మాత్రమే అమల్లో ఉందని కోర్టుకు తెలిపారు. ఆన్లైన్లో నామినేషన్ దరఖాస్తు చేసుకునే విధానాన్ని ప్రవేశపెట్టాలంటే పంచాయతీ ఎన్నికల నిబంధనల్లోని రూల్ 8ను సవరించాల్సి ఉంటుందని వివరించారు. ఇరుపక్షాల వాదనలు పరిగణనలోకి తీసుకున్న ఏపీ హైకోర్టు, ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.
తాజావార్తలు
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికల నామినేషన్ విధానంపై హైకోర్టులో పిటిషన్.. కీలక ఆదేశాలు..
-
Police T20 Cricket Tournament : హైదరాబాద్‌లో పోలీసుల క్రికెట్ సందడి.. డిసెంబర్లో జాతీయ టోర్నీ!
-
Sonia Gandhi: రాజీవ్ గాంధీ ప్రధాని కావడం నాకు ఇష్టం లేదు.. సోనియా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Arnab Cyclone Alert: తీరానికి సమీపంలో ‘అర్నబ్’ తుఫాన్.. మరో 12 గంటలు అత్యంత అప్రమత్తం!
-
Arnab Cyclone: కోనసీమకు కాళరాత్రి.. గజగజ వణుకుతున్న లంక గ్రామాలు
ట్రెండింగ్
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!