Sonia Gandhi: రాజీవ్ గాంధీ ప్రధాని కావడం నాకు ఇష్టం లేదు.. సోనియా ఆసక్తికర వ్యాఖ్యలు..
- నవంబర్ 10న సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదల..
- రాజీవ్ ప్రధాని కావడం తనకు ఇష్టం లేదన్న సోనియా..
- విడుదలకు ముందే సంచలంగా మారిన ‘‘బిలాంగింగ్స్: ఏ జర్నీ ఆఫ్ లవ్’’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sonia Gandhi: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆత్మకథ ‘‘బిలాంగింగ్స్: ఏ జర్నీ ఆఫ్ లవ్’’ విడుదలకు సిద్ధమవుతోంది. విడుదలకు ముందే ఈ పుస్తకం సంచలనంగా మారింది. మంగళవారం సోనియా గాంధీ తన ఆత్మకథ పుస్తకంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తన భర్త రాజీవ్ గాంధీ ప్రధాని కావడాన్ని తాను మొదట వ్యతిరేకించానని చెప్పారు. ఈ పుస్తకం వెలువడిన తర్వాత కొందరి అభిప్రాయాలు మారవచ్చని, మరికొందరికి తనపై ఉన్న అభిప్రాయం మరింత ప్రతికూలంగా మారవచ్చని సోనియా అన్నారు. మంగళవారం విడుదల చేసిన ఒక వీడియోలో ఆమె మాట్లాడుతూ.. తన జీవితంలో జరిగిన సంఘటనల్ని, తన కోణంలో ప్రజలకు వివరించే అవకాశం ఈ పుస్తకం ద్వారా లభించిందని అన్నారు.
తమాషా తప్పదు..
తన ఆత్మకథపై ప్రజల్లో ఎలాంటి చర్చ జరిగే అవకాశం ఉందో సోనియా ముందుగానే ఊహించారు. ‘‘తన గురించి కొంత మంది అభిప్రాయాలు మారొచ్చు. కొందరికి తనపై ఉన్న అభిప్రాయం మరింత దిగజారొచ్చు. పుస్తకం రాసినప్పుడు లేదా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఇలాంటివి సహజమే. కొంత తమాషా జరగడం తప్పదు’’ అని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలతో ఈ పుస్తకంలో వ్యక్తిగత, రాజకీయంగా సున్నితమైన అంశాలు చర్చించారనే సంకేతాలు ఇచ్చారు.
Also Read
- PM Modi: ప్రధాని మోడీ గొప్ప మనసు.. వృద్ధురాలికి స్వయంగా సాయం
- Bhagwant Mann's Pakistan Visit: భగవంత్ మాన్ పాకిస్థాన్ పర్యటనకు అనుమతి వస్తుందా?.. కేంద్రం కీలక ప్రకటన
- CS Karnan Dies: సీజేఐ సహా సుప్రీంకోర్టు జడ్జీల అరెస్టుకే ఆదేశాలు.. వివాదాస్పద మాజీ హైకోర్టు న్యాయమూర్తి కర్ణన్ కన్నుమూత!
- Indian Sailors: కరాచీ పోర్టులో చిక్కుకున్న ఆరుగురు భారతీయులు.. పాక్‌తో భారత్ సంప్రదింపులు!
నవంబర్ 10న విడుదల..
సోనియా గాంధీ బయోగ్రఫీ నవంబర్ 10న విడుదల కానుంది. ఇందులో నెహ్రూ-గాంధీ కుటుంబానికి సంబంధించిన కీలక సంఘటనలు ఉన్నాయి. ఈ తేదీన ఈ పుస్తకం మార్కెట్లోకి వస్తుంది. 544 పేజీల ఈ పుస్తకంలో ఇటలీలో ఆమె బాల్యం, 1965లో కేంబ్రిడ్జ్‌లో రాజీవ్ గాంధీతో ఆమె తొలి భేటీ, ఆమె వివాహం, ఇందిరా గాంధీ మరియు రాజీవ్ గాంధీల హత్యలు, ఆమె రాజకీయ ప్రవేశం, 2004లో ప్రధానమంత్రి పదవిని అంగీకరించకూడదని ఆమె తీసుకున్న నిర్ణయం వంటి అంశాలు ఉన్నాయి. హార్పర్‌కాలిన్స్ ఈ పుస్తకం యొక్క భారతీయ ఎడిషన్‌ను ప్రచురిస్తుంది.
There’s bound to be some tamasha when this book comes out. After all, others have spent decades telling my “story”, now it’s my turn. https://t.co/jDy5vBI8ey
— Sonia Gandhi (@SoniaGandhi) October 27, 2026
తాజావార్తలు
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
Palak Paneer Pakoda Recipe: ఇంట్లోనే సింపుల్‌గా పాలక్ పనీర్ పకోడాలు.. తయారీ విధానం ఇదిగో!
-
Vivo T6x 5G: Vivo T6x 5G త్వరలో భారత్‌లో లాంచ్.. BIS సర్టిఫికేషన్‌లో ప్రత్యక్షం.. 50MP కెమెరా, భారీ బ్యాటరీ
-
PM Modi: ప్రధాని మోడీ గొప్ప మనసు.. వృద్ధురాలికి స్వయంగా సాయం
-
Virat Kohli: తనను డకౌట్ చేసిన మాథ్యూ హెన్రీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన కింగ్ కోహ్లీ.. వీడియో వైరల్..
ట్రెండింగ్
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!