Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Khammam Tummala Nageswara Rao About Ntr Chandrababu And Kcr

Tummala Nageswara Rao: ఎన్టీఆర్‌ ఎప్పుడూ నా గుండెల్లో ఉంటారు.. తుమ్మల భావోద్వేగం..

Published Date :October 28, 2022 , 1:01 pm
By Sudhakar Ravula
Tummala Nageswara Rao: ఎన్టీఆర్‌ ఎప్పుడూ నా గుండెల్లో ఉంటారు.. తుమ్మల భావోద్వేగం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్య శ్యామలం చేయడమే నాధ్యేయం అన్నారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. నాడు ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు సీఎం కేసీఆర్‌ ప్రోత్సాహంతో ప్రజాసేవ చేస్తున్నాను.. ముగ్గురు ముఖ్యమంత్రుల ప్రోత్సాహంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి పాటుపడ్డానని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అన్నగారు ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సత్తుపల్లి మండలం కాకర్లపల్లి రోడ్డు నుండి లింగపాలెం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు.. లింగపాలెం గ్రామంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి నివాళులు ఆర్పించారు. అనంతరం వేంసూరు మండల కేంద్రంలో ఎన్టీఆర్‌ కాలువకు పూజలు చేసి పుష్పాభిషేకం చేశారు.. అనంతరం తుమ్మల మాట్లాడుతూ ఎన్టీఆర్ తనకు రాజకీయ జన్మనిస్తే సత్తుపల్లి ప్రజానికం దీవెనలతో ఈ స్థాయిలో ఉన్నారు.. దేవుడు లాంటి ఎన్టీఆర్‌ వల్ల వేంసూరు మండలంలో సాగు నీటి కష్టాలు తీరాయన్నారు.

Read Also: Nirmala Sitharaman: ఏపీకి కేటాయింపుల్లో ప్రధానికి రెండో ఆలోచనే ఉండదు..!

ఇక, అసంపూర్తిగా ఉన్న కాలువ సీఎం కేసీఆర్ పాలనలో పూర్తిచేశాం అని తెలిపారు తుమ్మల నాగేశ్వరరావు.. తన జీవిత ఆశయం సీతారామ ప్రాజెక్ట్‌తో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్య శ్యామలం చేయడమే అని పేర్కొన్నారు. నాడు ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, ఇప్పుడు కేసీఆర్ ప్రోత్సాహంతో ప్రజాసేవ చేస్తున్నాను.. ముగ్గురు ముఖ్యమంత్రుల ప్రోత్సాహంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి పాటుపడ్డానని.. సత్తుపల్లి మాదిరి పాలేరును కూడా అభివృద్ధి చేశామని తెలిపారు. పాలేరులో సాగు నీటి కష్టాలు తీరాయి, జాతీయ రహదారులతో భూముల రేట్లు పెరిగాయన్న ఆయన.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అభివృద్ధి కొనసాగడం కోసం మీ దీవెనలతో, భద్రాద్రి రాముడి ఆశీస్సులతో చివరి శ్వాస వరకు నిలబడతా.. సత్తుపల్లి ప్రజలను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.. ఇక, రాజకీయ జన్మనిచ్చిన ఎన్టీఆర్ ఎప్పటికీ నా గుండెల్లో ఉంటారని ప్రకటించారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. అంతకు ముందు సత్తుపల్లి పట్టణం నుండి లింగపాలేం వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. లింగపాలేం నుండి తుమ్మల బుల్లెట్‌ నడిపి తన అభిమానులను ఉత్సహపరిచారు.. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి మండలాల నుండి ఎన్టీఆర్‌, తుమ్మల అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • chandrababu
  • cm kcr
  • khammam
  • ntr
  • telangana

తాజావార్తలు

  • Islamabad: ఇస్లామాబాద్ చేరుకున్న జేడీ వాన్స్ బృందం.. చర్చలు ఆలసమయ్యే ఛాన్స్

  • Jailer 2: ‘జైలర్ 2’లో షారుఖ్ ఔట్.. పవన్ కళ్యాణ్ ఇన్? రజినీకాంత్ మూవీలో పవర్ స్టార్ సెన్సేషన్!

  • Tirumala Devotees Record: రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు.. ఏడాదిలో 2.67 కోట్ల మందికి దర్శనం..

  • Best CNG SUVs India: దేశంలో అత్యంత చౌకైన 5 CNG SUVలు ఇవే.. ధరలు రూ. 6.75 లక్షల నుండి ప్రారంభం

  • PSL 2026 Controversy: “ఆ బోలింగ్ బాలేదు.. నేను ఆడను పో”.. పాకిస్థాన్ సుపర్‌ లీగ్‌లో గమ్మత్తు ఉదంతం..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions