Group-2: గ్రూప్-2 పోస్టుల భర్తీకి పరీక్షల నిర్వహణపై టీఎస్పీఎస్సీ కసరత్తు ప్రారంభించింది. జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించే ఈ పరీక్ష నిర్వహణకు సంబంధించి సోమవారం నాంపల్లిలోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో కమిషన్ సమావేశం నిర్వహించి.. పరీక్షల నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. ఈ ఏడాది ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష జరగనుంది. అభ్యర్థుల కోరిక మేరకు కమిషన్ పరీక్షను వాయిదా వేసి నవంబర్ 2, 3 తేదీల్లో నిర్వహిస్తామని ప్రకటించింది.అయితే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కారణంగా మరోసారి వాయిదా పడింది.
Read also: Congress CM: హీటెక్కిన పదవుల లొల్లి.. మాకే కావాలంటున్న సీనియర్లు
జనవరి 6, 7 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది.ఈ నేపథ్యంలో పరీక్ష నిర్వహణ, సౌకర్యాలు, నిబంధనలు తదితర అంశాలపై 33 జిల్లాల కలెక్టర్లకు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్ పలు సూచనలు చేశారు. ముందుగా గుర్తించిన పరీక్షా కేంద్రాల్లో నిర్వహించి ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే వారికి తెలియజేయాలి. చీఫ్ సూపరింటెండెంట్ గదిలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఉండాలని, కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ తెరిచి అక్కడ పంపిణీ చేయాలని, ఓఎంఆర్ షీట్లను లెక్కించి ప్యాక్ చేసి సీలు వేయాలని వివరించారు. పరీక్షా కేంద్రాలను ఈ నెల 7వ తేదీలోగా ఖరారు చేసి టీఎస్ పీఎస్సీకి నివేదించాలని ఆదేశించారు.
Animal Movie : ‘యానిమల్’ సినిమాలో చూపించిన ఫ్యాలెస్ ఎవరిదో తెలుసా?