Congress CM: కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు పట్టం కట్టినప్పటికీ ఎవరు అధికార పీఠాన్ని అధిరోహిస్తారని దానిపై ఇంకా క్లారిటీ లేదు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి రెండు రోజులు కావస్తున్నా.. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే దానిపై కాంగ్రెస్ అధిష్టానం కొలిక్కి రాలేకపోవడంతో ఈ విషయం కాస్త తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. నలుగురిలో ఒకరు సీఎం రేసులో ఉండడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం అభ్యర్థి ఎంపిక వ్యవహారం ఢిల్లీకి చేరింది. డిసెంబర్ 3న (ఆదివారం) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని అందరూ భావించారు. అయితే సోమవారం నాటి సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి అభ్యర్థిపై స్పష్టత వస్తుందని పెద్దఎత్తున ప్రచారం జరిగినా.. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పెరిగిపోవడంతో సీఎం అభ్యర్థిత్వానికి పోటీ కూడా అనివార్యమైంది.
అయితే.. తెరవెనుక ప్రయత్నాలు ఎవరికి వారు ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పగిస్తామని భావించినా తాము కూడా రేసులో ఉన్నామని పలువురు సీనియర్లు పోటీ పడుతున్నారు. సీఎల్పీ సమావేశానికి ముందు సీఎల్పీ మాజీ అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి తదితరులు తమ పేర్లను పరిశీలించాలని పార్టీ వ్యవహారాల పరిశీలకులకు విజ్ఞప్తి చేశారు. సీఎల్పీ నేత ఎంపికను పార్టీ జాతీయ అధ్యక్షుడికి అప్పగించాలన్న నిర్ణయం అంత ఈజీ కాదని కాంగ్రెస్ పార్టీ నేతలకు స్పష్టమైంది. గెలిచిన ఎమ్మెల్యేల్లో కూడా భిన్నాభిప్రాయాలు, తలలు పట్టుకుంటున్నారు. గెలిచిన ఎమ్మెల్యేల నుంచి సేకరించిన సమాచారంలో రేవంత్ రెడ్డి పేరును 25 మంది బలపరిచారు. రేవంత్ రెడ్డితో పాటు పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క పేర్లు కూడా ఎమ్మెల్యేల నుంచి రావడంతో కాంగ్రెస్ నేతలు ఉదాసీనతకు గురయ్యారు.
Read also: Supreme Court: ఆత్మహత్యకు ప్రేరేపించినా శిక్షకు అర్హులే.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఫలితాల అనంతరం రేవంత్ రెడ్డి వీలైనంత త్వరగా అధికార పీఠాన్ని అధిష్టించాలని భావించినా కాంగ్రెస్ పార్టీ సీనియర్లు మాత్రం మోకాలడ్డారు. వారిలో ఒకరు రేవంత్ రెడ్డి కంటే పార్టీలో సీనియర్లని, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకున్నారని, మరొకరు ఉద్యమ కాలం నుంచి ప్రత్యేక రాష్ట్రం కోసం పార్టీలో పోరాడారని అన్నారు. తమను కాదని రేవంత్ రెడ్డికి బాధ్యతలు అప్పగించడంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు సీఎం పదవి అప్పగించే విషయంలో పార్టీలో సీనియర్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూర్చేందుకు దళిత నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చినట్లు సమాచారం. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ మాజీ తెలుగు ఐఏఎస్ అధికారి రాహుల్ గాంధీకి ఈ ప్రతిపాదనలు చేసినట్లు చెబుతున్నారు.
పార్లమెంటు ఎన్నికల వరకు దళిత్ కార్డును ఉపయోగించాలనే ప్రతిపాదనలను కూడా పార్టీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తమకు అవకాశం రాకపోవడంతో కాంగ్రెస్ సీనియర్లు ఇలాంటి ప్రతిపాదనలు తీసుకొచ్చారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు కర్ణాటక తరహా ఫార్ములా అమలైతే తెలంగాణకు ఒక్కరే డిప్యూటీ సీఎం కావాలని మల్లు భట్టి విక్రమార్క పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ సీఎం అయ్యే అవకాశం వస్తే ములుగు ఎమ్మెల్యే సీతక్కకు కీలక బాధ్యతలు అప్పగించే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వాటికి చెక్ పెట్టేందుకు మల్లు ఎలాంటి షరతులు పెట్టలేదని తెలుస్తోంది. ఖమ్మం జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలవడంలో కీలక పాత్ర పోషించిన పొంగులేటి శ్రీనివాస రెడ్డి తాను రేసులో లేనని స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. పొంగులేటి పోటీలో లేకపోయినా.. ఒక వర్గాన్ని ప్రత్యేకంగా ఉంచాలని కూడా పార్టీ అధిష్టానం భావించింది.
Read also: Rangareddy: ఆరేళ్ళ క్రితం మైనర్ బాలికపై అఘాయిత్యం.. నిండిదితుడికి 20 ఏళ్ళు జైలు శిక్ష
పొంగులేటి, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంలో విముఖత వ్యక్తం చేస్తున్నారు. అందరి ఎమ్మెల్యేల మద్దతు గణనీయంగా ఉండడంతో రేవంత్ రెడ్డికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ లో బలమైన సామాజిక వర్గంగా ఉన్న నేతలతో కాకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ప్రత్యర్థులకు అవకాశం వస్తుందన్న ఆందోళన పార్టీలో నెలకొంది. కాస్త ఆలస్యమైనా అందరినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మరోవైపు.. సీతక్కకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరగా సీనియర్ నేతలు సమస్యే లేదని కరాఖండిగా చెప్పేశారంట. దీంతో.. ఒకరిపై ఒకరు పరుష పదజాలంతో మాటలు అనుకున్నట్టు సమాచారం. అయితే.. భట్టి, దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు వీళ్లందరూ సీఎల్పీ మీటింగ్ నుంచి వెళ్లిపోయారని వినికి.. అంతేకాకుండా.. సీఎం పదవి ప్రశ్నార్థకమైతే.. మరోవైపు పీసీసీ చీఫ్ పదవిపైన కూడా సందిగ్ధత వీడలేదంట.
Animal Movie : ‘యానిమల్’ సినిమాలో చూపించిన ఫ్యాలెస్ ఎవరిదో తెలుసా?