Cheyutha Pension : గుడ్‌న్యూస్.. చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
- చేయూత పింఛన్లకు మరో రోజు అవకాశం
- రేపు సాయంత్రం 5 గంటల వరకు గడువు
- వరుస సెలవులతో దరఖాస్తులకు ఇబ్బందులు
- అర్హులంతా అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cheyutha Pension : తెలంగాణ ప్రభుత్వం చేయూత పథకం కింద నూతన పింఛన్ల (చేయూత పెన్షన్లు) దరఖాస్తుల స్వీకరణ గడువును మరో రోజు పొడిగించింది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో లబ్ధిదారులు రేపు సాయంత్రం 5:00 గంటల వరకు తమ దరఖాస్తులను సమర్పించుకునే వెసులుబాటు కలిగింది. పూర్వపు షెడ్యూల్ ప్రకారం చేయూత నూతన పింఛన్ల దరఖాస్తు గడువు నేటితో ముగియాల్సి ఉంది. అయితే, వరుసగా మూడు రోజుల పాటు ప్రభుత్వ సెలవులు రావడంతో అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Also Read
సకాలంలో దరఖాస్తులు అందజేయలేకపోయామని పలువురు విజ్ఞప్తి చేయడంతో, లబ్ధిదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని గడువును మరో రోజు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చేయూత పింఛన్ల దరఖాస్తు గడువును రేపు సాయంత్రం వరకు పొడిగిస్తున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) సీఈవో దివ్య దేవరాజన్ వెల్లడించారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అర్హత ఉండి ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని లబ్ధిదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..