VC.Sajjanar: తెలంగాణ విద్యార్థులంతా టీఎస్ ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇప్పటికే విద్యార్థులకు అందుబాటులోకి రకా రకాల బస్ పాస్ లు అందజేస్తుండగా.. అధికారులు రాయితీపై బస్ పాస్ లను కూడా అందజేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో అనేక వేల మంది విద్యార్థులు బస్‌పాస్‌లతో ప్రయాణిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. టీఎస్‌ఆర్టీసీ ప్రజలకు మరింత సేవలందించేందుకు కొత్త కొత్త స్కీంలను ప్రవేశపెడుతోంది. ఇప్పటకే చాలా వినూత్న పథకాలకు టీఎస్‌ఆర్టీసీ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
అయితే.. ఈ నేపథ్యంలోనే మరోసారి ప్రజలకు మరో ఆఫర్‌ను ప్రకటించింది. జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లే వారికి శుభావార్త చెప్పింది. వేములవాడ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి కొత్త సర్వీసును శుక్రవారం సెప్టెంబర్ 22 నుంచి #TSRTC ఏర్పాటు చేసింది. ఈ డీలక్స్ బస్సు ప్రతి రోజు సాయంత్రం 4:30 గంటలకు వేములవాడ నుంచి బయలుదేరుతుంది. సిరిసిల్ల, సిద్దిపేట, జెబిఎస్ మీదుగా శంషాబాద్ విమానశ్రయానికి రాత్రి 9 గంటలకు చేరుకుంటుంది. ఎయిర్ పోర్ట్ నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరి ఉదయం 10 గంటలకు వేములవాడకు వస్తుంది. ఆయా ప్రాంతాల నుంచి దుబాయ్, మస్కట్, తదితర ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకొని.. ఈ కొత్త సర్వీసును ఆదరించాలని సంస్థ కోరుతోంది.
ముందస్తు రిజర్వేషన్‌పై తగ్గింపు
దసరా పండుగ సందర్భంగా సొంతుళ్లకు వెళ్లే వారూ ముందుగా టీఎస్‌ఆర్టీసీలో బస్సు టికెట్లను బుక్ చేసుకుంటే 10 శాతం రాయితీ అందిస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబరు 15 నుంచి 29లోపు ఒకే సమయంలో టికెట్లు బుక్ చేసుకుంటే తిరుగు ప్రయాణంలో 10 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించారు. ఆయా తేదీల్లో ప్రయాణానికి ఈ నెల 30వ తేదీ వరకు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు మాత్రమే 10 శాతం రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. రిజర్వేషన్ సదుపాయం ఉన్న అన్ని సర్వీసుల్లో రాయితీ వర్తిస్తుందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలకు కూడా చాలా మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు 10 శాతం రాయితీ ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది. ఈ తగ్గింపు దసరా పండుగ సెలవుల్లో 15 రోజులు మాత్రమే వర్తిస్తుంది. దూర ప్రాంతాలకు వెళ్లే వారు ఈ రాయితీ సౌకర్యాన్ని వినియోగించుకుని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి. TSRTC బస్సులలో ముందస్తు రిజర్వేషన్ కోసం సంస్థ యొక్క అధికారిక వెబ్‌సైట్ www.tsrtconline.in ని సంప్రదించాలని టీఎస్‌ఆర్‌టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు.
గల్ఫ్ దేశాలకు రాకపోకలు సాగించే వారి సౌకర్యార్థం వేములవాడ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి కొత్త సర్వీసును శుక్రవారం(సెప్టెంబర్ 22) నుంచి #TSRTC ఏర్పాటు చేసింది. ఈ డీలక్స్ బస్సు ప్రతి రోజు సాయంత్రం 4:30 గంటలకు వేములవాడ నుంచి బయలుదేరుతుంది. సిరిసిల్ల, సిద్దిపేట, జెబిఎస్ మీదుగా… pic.twitter.com/agIRfEM0bJ
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) September 23, 2023
Top Headlines @ 1 PM: టాప్ న్యూస్