Fake Doctor Racket Busted: 11వ తరగతి చదివి డాక్టర్‌గా అవతారం.. నకిలీ MBBS డిగ్రీలతో ఢిల్లీలో వైద్యం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Doctor Racket Busted in Rajasthan: రాజస్థాన్‌లో భారీ నకిలీ మెడికల్ డిగ్రీల ముఠా గుట్టురట్టయింది. ఎలాంటి వైద్య విద్యార్హతలు లేకపోయినా నకిలీ MBBS, MD డిగ్రీలతో ఆసుపత్రుల్లో డాక్టర్లుగా పనిచేస్తున్న వారి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. జైపూర్‌లో రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) అధికారులు ఈ ముఠాపై దాడులు చేసి నలుగురు నిందితులను అరెస్టు చేశారు. నాలుగు రాష్ట్రాలకు విస్తరించిన ఈ నెట్వర్క్ ద్వారా లక్షల రూపాయలకు నకిలీ వైద్య పట్టాలను విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.
రూ.5.5 లక్షలకు MBBS, MD డిగ్రీలు!
ఈ ముఠా సోషల్ మీడియా వేదికలైన ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా కస్టమర్లను సంప్రదించి నకిలీ వైద్య డిగ్రీలను విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. MBBS, MD, గైనకాలజీ, DMRD వంటి వైద్య పట్టాలను సుమారు రూ.5.5 లక్షలకు విక్రయించినట్లు సమాచారం. మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. నకిలీ డిగ్రీలను తయారు చేయడంతోపాటు వాటిని సంబంధిత యూనివర్సిటీల వెబ్సైట్లలో అప్లోడ్ చేసి, మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ కూడా చేయించేందుకు ఈ ముఠా ప్రయత్నించినట్లు విచారణలో వెల్లడైంది.
Also Read
- December 2026 Updates: కొత్త నెల, కొత్త రూల్స్.. డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రాబోతున్న పెద్ద మార్పులివే!
- Women's Reservation Bill 2026: మహిళా రిజర్వేషన్ బిల్లుపై మోడీ సర్కార్ కీలక నిర్ణయం?.. నేడు కేంద్ర కేబినెట్ భేటీ
- Cabinet Meeting: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ మోడీ కేబినెట్ కీలక భేటీ..
- Viral Video: కదులుతున్న రైలులో దీపం వెలిగించి పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ సీరియస్..
11వ తరగతి చదివి ఢిల్లీలో డాక్టర్‌గా విధులు
ఈ వ్యవహారంలో రామ్‌కిషోర్ మహావర్ అనే వ్యక్తిని రాజస్థాన్ SOG అధికారులు అరెస్టు చేశారు. కేవలం 11వ తరగతి వరకు చదివిన అతడు.. నకిలీ MBBS, MD డిగ్రీల ఆధారంగా ఢిల్లీలోని ఆసుపత్రుల్లో డాక్టర్‌గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఈ నెట్‌వర్క్‌లో కీలక పాత్ర పోషించిన మరో ముగ్గురిని కూడా అధికారులు అరెస్టు చేశారు.
సత్యజిత్ పాణిగ్రాహి: ముంబైలో అరెస్టయ్యాడు. కస్టమర్లను సంప్రదించడం, వారికి నకిలీ డిగ్రీలను విక్రయించడం ఇతడి బాధ్యత.
మనిష్ మాంజీ: నకిలీ మార్కుల మెమోలు, డిగ్రీలు, డిప్లొమాలను తయారు చేసేవాడు.
ఖుర్రమ్ తౌఫిక్: నకిలీ డిగ్రీలను యూనివర్సిటీల వెబ్సైట్లలో ఆన్లైన్లో అప్లోడ్ చేసేవాడు. ఇతడిని ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో అరెస్టు చేశారు.
మూడు దశల్లో నకిలీ డిగ్రీల దందా
ఈ ముఠా కార్యకలాపాలు ప్రధానంగా మూడు దశల్లో సాగినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
మొదటి దశ: కస్టమర్లను సంప్రదించడం
సత్యజిత్ పాణిగ్రాహి ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా వ్యక్తులను సంప్రదించి, వారి అవసరాలకు అనుగుణంగా ఏయే డిగ్రీలు కావాలో చర్చించేవాడు. ధరలు నిర్ణయించి ఆర్డర్లు తీసుకునేవాడు.
రెండో దశ: నకిలీ సర్టిఫికెట్ల తయారీ
మనిష్ మాంజీ నకిలీ మార్కుల మెమోలు, డిగ్రీలు, డిప్లొమాలను తయారు చేసేవాడు. వాటిని వాట్సాప్ ద్వారా సత్యజిత్‌కు పంపించేవాడు. అవసరమైతే ముద్రించిన సర్టిఫికెట్లను DTDC కొరియర్ ద్వారా కూడా పంపించేవారు.
మూడో దశ: యూనివర్సిటీ వెబ్సైట్లలో అప్లోడ్
ఈ నెట్‌వర్క్‌లో ఇది కీలకమైన దశ. తయారు చేసిన నకిలీ డిగ్రీలను సంబంధిత యూనివర్సిటీల వెబ్సైట్లలో ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు ప్రత్యేకంగా ఒక వ్యక్తిని నియమించినట్లు విచారణలో తేలింది.
యూపీలో మరో 41 మంది నకిలీ ఆయుర్వేద వైద్యులు గుర్తింపు
ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్‌లో కూడా నకిలీ వైద్యుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నకిలీ విద్యార్హత పత్రాలతో వైద్యం చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 41 మంది ఆయుర్వేద వైద్యులను అధికారులు గుర్తించారు. వీరు నకిలీ BAMS మార్కుల మెమోలు, ఇంటర్న్‌షిప్ సర్టిఫికెట్లు, డిగ్రీలు, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ల (NOC) ఆధారంగా ఆయుర్వేద, యునాని తిబ్బీ మెడిసిన్ బోర్డులో రిజిస్ట్రేషన్ పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి.
విచారణలో భాగంగా శ్రీకృష్ణ ప్రభుత్వ ఆయుర్వేద మెడికల్ కాలేజ్ (కురుక్షేత్ర), పండిట్ భగవత్ దయాళ్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (రోహ్తక్) పేర్లతో జారీ చేసినట్లుగా చూపించిన BAMS మార్కుల మెమోలు, ఇంటర్న్‌షిప్, డిగ్రీ సర్టిఫికెట్లు నకిలీవని అనుమానిస్తున్నారు. హర్యానా ఇండియన్ మెడికల్ కౌన్సిల్ పేరుతో జారీ చేసినట్లు చూపించిన NOCలు కూడా నకిలీవని దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం. ఈ పత్రాలతో రిజిస్ట్రేషన్ పొందిన అనంతరం ఆయుర్వేద వైద్యులుగా ప్రాక్టీస్ చేసినట్లు వారిపై ఆరోపణలు ఉన్నాయి.
వైద్య విద్యార్హతలు లేని వ్యక్తులు నకిలీ డిగ్రీలతో వైద్యులుగా చలామణి కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి వ్యక్తుల చేతుల్లో చికిత్స పొందితే రోగుల ఆరోగ్యానికి, ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. నకిలీ సర్టిఫికెట్ల తయారీతోపాటు వాటికి అధికారిక గుర్తింపు ఉన్నట్లు చూపించే ప్రయత్నాలు వైద్య వ్యవస్థ విశ్వసనీయతపైనా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
తాజావార్తలు
-
Fake Doctor Racket Busted: 11వ తరగతి చదివి డాక్టర్‌గా అవతారం.. నకిలీ MBBS డిగ్రీలతో ఢిల్లీలో వైద్యం!
-
HP OmniBook Ultra 16: డెవలపర్లు, క్రియేటర్ల కోసం.. HP పవర్ఫుల్ AI ల్యాప్‌టాప్ లాంచ్.. 128GB RAM, NVIDIA AI చిప్
-
Hyderabad: ఖైరతాబాద్ GHMC జోనల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. కీలక ఫైళ్లు దగ్ధం!
-
25 రోజుల బ్యాటరీ బ్యాకప్, 100+ స్పోర్ట్స్ మోడ్స్ తో Vivo WATCH GT 2 స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Sineth Jayawardena: కోచ్ మాటలతో టీమిండియాపై చెలరేగిపోయా.. శ్రీలంక సెంచరీ హీరో సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
BSNL సంచలనం.. రూ.51కే 56GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్..!
-
IND vs NZ 2nd Test: అరంగేట్రంలోనే వికెట్ తీసిన గుర్నూర్.. లాథమ్ హాఫ్ సెంచరీతో దూకుడుగా..!
-
Viral Video: కదులుతున్న రైలులో దీపం వెలిగించి పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ సీరియస్..
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..