HP OmniBook Ultra 16: డెవలపర్లు, క్రియేటర్ల కోసం.. HP పవర్ఫుల్ AI ల్యాప్‌టాప్ లాంచ్.. 128GB RAM, NVIDIA AI చిప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HP OmniBook Ultra 16 (2026) Launched in India: ప్రముఖ టెక్నాలజీ సంస్థ HP భారత మార్కెట్లో కొత్త AI ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. HP OmniBook Ultra 16 (2026) పేరుతో తీసుకొచ్చిన ఈ ల్యాప్‌టాప్‌ను ముఖ్యంగా డెవలపర్లు, కంటెంట్ క్రియేటర్లు, AI నిపుణులను దృష్టిలో పెట్టుకుని రూపొందించింది. NVIDIA RTX Spark సూపర్చిప్తో పనిచేసే ఈ ల్యాప్‌టాప్‌లో 20-కోర్ CPU, 6,144-కోర్ Blackwell RTX GPU ఉన్నాయి. అంతేకాకుండా 128GB వరకు యూనిఫైడ్ మెమరీ, 1 పెటాఫ్లాప్ వరకు FP4 AI పనితీరును అందిస్తుందని కంపెనీ వెల్లడించింది.
భారత్‌లో HP OmniBook Ultra 16 ల్యాప్‌టాప్ 64GB RAM, 1TB SSD వేరియంట్ ప్రారంభ ధరను రూ.5,49,999గా నిర్ణయించింది. మరోవైపు 128GB RAM, 1TB SSD వేరియంట్ ధర రూ.6,99,999గా ఉంది. ఈ ల్యాప్‌టాప్ Eclipse Grey కలర్లో HP ఆన్లైన్ స్టోర్ ద్వారా అందుబాటులో ఉంది. డిసెంబర్ 1 నుంచి షిప్పింగ్ ప్రారంభం కానుంది. ఎంపిక చేసిన SBI క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసే కస్టమర్లకు రూ.40,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం ఉంది.
Also Read
- 25 రోజుల బ్యాటరీ బ్యాకప్, 100+ స్పోర్ట్స్ మోడ్స్ తో Vivo WATCH GT 2 స్మార్ట్‌వాచ్ లాంచ్..!
- BSNL సంచలనం.. రూ.51కే 56GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్..!
- Hisense Smart TV: భారత్‌లోకి 55, 65 ఇంచెస్ కొత్త 4K MiniLED టీవీలు.. 120Hz మోడ్, Dolby Atmos ఫీచర్లు.. ధర ఎంతంటే?
- IBM: H-1B వీసాదారులకు IBM షాక్.. అమెరికా వదిలి వెళ్లండి లేదా ఉద్యోగం మానేయండి!
ఈ ల్యాప్‌టాప్ Windows 11 Home Single Language ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఇందులో 16 అంగుళాల 3K OLED టచ్‌స్క్రీన్ డిస్ప్లేను అందించారు. 2,880 × 1,800 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పాటు 120Hz వరకు రిఫ్రెష్ రేట్ దీనికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ డిస్ప్లే 100 శాతం DCI-P3 కలర్ కవరేజ్, SDR మోడ్‌లో 500 నిట్స్, HDR మోడ్‌లో 1,100 నిట్స్ వరకు బ్రైట్నెస్ను అందిస్తుంది. లో బ్లూ లైట్ సపోర్ట్‌తో పాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణ కూడా ఉంది.
HP OmniBook Ultra 16లో NVIDIA RTX Spark N1X ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇందులో 20-కోర్ CPU, 6,144-కోర్ NVIDIA Blackwell RTX ఇంటిగ్రేటెడ్ GPU ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్‌లో 64GB LPDDR5x RAM, 1TB PCIe Gen 5 NVMe SSD స్టోరేజ్ అందించారు. 128GB RAM వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. కంపెనీ ప్రకారం ఈ సిస్టమ్ 1 పెటాఫ్లాప్ వరకు FP4 AI పనితీరును అందిస్తుంది. పెద్ద AI మోడల్స్‌ను స్థానికంగానే రన్ చేయడం, AI ఏజెంట్లను ఉపయోగించడం వంటి పనులకు ఇది ఉపయోగపడుతుంది.
వీడియో కాల్స్, ఆన్లైన్ మీటింగ్స్ కోసం ఇందులో 5 మెగాపిక్సెల్ IR కెమెరాను అందించారు. HDR ఆటో స్విచ్, టెంపోరల్ నాయిస్ రిడక్షన్ ఫీచర్లు ఉన్నాయి. ఆడియో విషయానికి వస్తే HP Audio Boost, Poly Studio, DTS Virtual:X సపోర్ట్‌తో కూడిన క్వాడ్ స్పీకర్లను అందించారు.
కనెక్టివిటీ కోసం ఈ ల్యాప్‌టాప్‌లో అనేక సదుపాయాలు ఉన్నాయి.
Wi-Fi 7
Bluetooth 6.0
రెండు USB Type-C పోర్టులు
రెండు USB Type-A పోర్టులు
HDMI 2.1
హెడ్‌ఫోన్, మైక్రోఫోన్ కాంబో జాక్
microSD కార్డ్ రీడర్
వీటితో పాటు యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, IR థర్మల్ సెన్సర్లను కూడా అందించారు. HP OmniBook Ultra 16లో 99Wh బ్యాటరీని అమర్చారు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కేవలం 30 నిమిషాల్లో బ్యాటరీని 50 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. బాక్స్‌లో 140W USB Type-C GaN ఛార్జర్‌ను అందిస్తోంది. ఈ ల్యాప్‌టాప్‌ను సాండ్బ్లాస్టెడ్ అనోడైజ్డ్ ఫినిష్‌తో కూడిన అల్యూమినియం ఛాసిస్‌తో రూపొందించారు. మెరుగైన గాలి ప్రసరణ, వేడిని బయటకు పంపేందుకు HP టవర్ హింజ్, ట్రంక్ థర్మల్ ఆర్కిటెక్చర్‌ను ఉపయోగించింది. దీని కొలతలు 355.8 × 256.5 × 15.7 మిల్లీమీటర్లు కాగా, బరువు 2.22 కిలోగ్రాములు.
తాజావార్తలు
-
HP OmniBook Ultra 16: డెవలపర్లు, క్రియేటర్ల కోసం.. HP పవర్ఫుల్ AI ల్యాప్‌టాప్ లాంచ్.. 128GB RAM, NVIDIA AI చిప్
-
Hyderabad: ఖైరతాబాద్ GHMC జోనల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. కీలక ఫైళ్లు దగ్ధం!
-
25 రోజుల బ్యాటరీ బ్యాకప్, 100+ స్పోర్ట్స్ మోడ్స్ తో Vivo WATCH GT 2 స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Sineth Jayawardena: కోచ్ మాటలతో టీమిండియాపై చెలరేగిపోయా.. శ్రీలంక సెంచరీ హీరో సంచలన వ్యాఖ్యలు!
-
AP Cabinet Meeting Today: రూ.88,392 కోట్ల పెట్టుబడులు.. 54 వేల మందికి ఉద్యోగాలు!
ట్రెండింగ్
-
BSNL సంచలనం.. రూ.51కే 56GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్..!
-
IND vs NZ 2nd Test: అరంగేట్రంలోనే వికెట్ తీసిన గుర్నూర్.. లాథమ్ హాఫ్ సెంచరీతో దూకుడుగా..!
-
Viral Video: కదులుతున్న రైలులో దీపం వెలిగించి పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ సీరియస్..
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..